DSports:18 NOV:వెస్టిండీస్‌తో స్వదేశంలో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ (New Zealand vs West Indies) మధ్యలో న్యూజిలాండ్ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాటర్, తొలి వన్డేలో సెంచరీ చేసిన డారిల్ మిచెల్ (Daryl Mitchell) గాయం కారణంగా మిగిలిన రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో మిచెల్‌కు తొడ కండరాలు పట్టేశాయి. మ్యాచ్ అనంతరం అతడికి స్కానింగ్ చేయగా, చిన్నపాటి చీలిక (minor tear) ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో అతడికి రెండు వారాల విశ్రాంతి అవసరమని సూచించడంతో, న్యూజిలాండ్ సెలెక్టర్లు అతడిని జట్టు నుంచి తప్పించారు.రిప్లేస్‌మెంట్ మిచెల్ స్థానంలో వెటరన్ బ్యాటర్ హెన్రీ నికోల్స్‌ను (Henry Nicholls) జట్టులోకి తీసుకున్నారు.

కోచ్ రాబ్ వాల్టర్ వ్యాఖ్యలు డారిల్ మిచెల్ గాయంపై జట్టు కోచ్ రాబ్ వాల్టర్ నిరాశ వ్యక్తం చేశారు. “మిచెల్ వంటి అద్భుతమైన ఆటగాడు సిరీస్ మధ్యలో గాయం కారణంగా దూరమవ్వడం మాకు గట్టి ఎదురు దెబ్బే. అతడు మా జట్టులో కీలక సభ్యుడు. తదుపరి రెండు మ్యాచ్‌లలో అతడి లేని లోటు మాకు కచ్చితంగా కనిపిస్తుంది” అని వాల్టర్ పేర్కొన్నారు. అయితే, మిచెల్ త్వరలోనే వెస్టిండీస్‌తో జరగనున్న మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌కు తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉందని సమాచారం.సిరీస్ పరిస్థితి ఇప్పటికే తొలి వన్డేలో న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించి, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో ఉంది. నవంబర్ 19న రెండో వన్డే జరగనుంది.

న్యూజిలాండ్ జట్టు (అంచనా): డెవాన్ కాన్వే, రాచిన్ రవీంద్ర, విల్ యంగ్, హెన్రీ నికోల్స్, టామ్ లాథమ్ (వికెట్‌ కీపర్‌), మైఖేల్ బ్రేస్‌వెల్, మిచెల్ సాంట్నర్ (కెప్టెన్‌), జకారీ ఫౌల్క్స్, కైల్ జామిసన్, మాట్ హెన్రీ, జాకబ్ డఫీ, నాథన్ స్మిత్, బ్లైర్ టిక్నర్, మార్క్ చాప్‌మన్.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana