
DNews: Nov 17: తెలంగాణ ప్రభుత్వ ఆరోగ్య శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 1,284 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా, 24,045 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2024 నవంబర్ 10న నిర్వహించిన ఈ పరీక్షకు 23,323 మంది అభ్యర్థులు హాజరయ్యారు. మెరిట్ జాబితాను సిద్ధం చేసి, ధ్రువపత్రాల పరిశీలన పూర్తిచేసిన ప్రభుత్వం తాజాగా తుది మెరిట్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాను రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి డామోదర్ రాజనర్సింహ రాష్ట్ర సచివాలయంలో విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థుల జాబితాను వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి (TG MHSRB) అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్‌లో తుది మెరిట్ జాబితాను పరిశీలించవచ్చు. ఎంపికైన అభ్యర్థులను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బోధనా ఆసుపత్రులు, జిల్లా మరియు ఏరియా ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నియమించనున్నారు.
