DET:NOV 17:
బైసన్ ఓటీటీ విడుదల తేదీ ఖరారు!ఎప్పుడు?ఎక్కడ చూడొచ్చు?
కోలీవుడ్ నటుడు విక్రమ్ తనయుడు ధ్రువ్ విక్రమ్ హీరోగా,సంచలన దర్శకుడు మారి సెల్వరాజ్ రూపొందించిన సినిమా బైసన్.కబడ్డీ నేపథ్యంలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా,అక్టోబర్ నెలలో దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.థియేటర్లలో ఈ సినిమాను మిస్ అయిన ప్రేక్షకులు,ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వారి నిరీక్షణకు తెరపడింది.

ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుంది?
బైసన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.ఈ విషయాన్ని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.దీనితో,ధ్రువ్ విక్రమ్,అనూపమ పరమేశ్వరన్ నటించిన ఈ సినిమాను ఇంట్లో కూర్చుని ఎంచక్కా చూసే అవకాశం లభించింది.

విడుదల తేదీ ఎప్పుడంటే?

థియేటర్లలో మంచి వసూళ్లు సాధించిన బైసన్ సినిమాను నవంబర్ 21 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా కన్ఫర్మ్ అయ్యింది.ఈ వారం నుంచే ఓటీటీలో ఈ చిత్రం సందడి చేయనుంది.థియేట్రికల్ రిలీజ్ అయిన సుమారు నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలోకి వస్తోంది.

సినిమా గురించి క్లుప్తంగా:
కర్ణన్,పరియేరుమ్ పెరుమాళ్ వంటి బలమైన సినిమాలను అందించిన దర్శకుడు మారి సెల్వరాజ్ ఈ సినిమాను తీశారు. 1990ల నాటి గ్రామీణ ప్రాంతంలో,కబడ్డీ క్రీడాకారుడు మణతి గణేశన్ జీవితం నుంచి ప్రేరణ పొంది ఈ కథను రూపొందించారు. కుల,సామాజిక వివక్షను ఎదుర్కొని,అర్జున అవార్డు స్థాయికి ఎదిగిన ఒక పేద యువకుడి ప్రయాణమే ఈ చిత్రం.ఇందులో ధ్రువ్ విక్రమ్ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి.ఈ సినిమాను తమిళంతో పాటు తెలుగు,కన్నడ,మలయాళం,హిందీ భాషల్లో కూడా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ చేయనున్నారు.