DSports 17 Nov:హైదరాబాద్‌కు చెందిన యువ షూటర్ ధనుష్ శ్రీకాంత్ తన అద్భుతమైన ప్రతిభతో ప్రపంచ వేదికపై మరోసారి బంగారు కాంతులను వెదజల్లాడు. పుట్టుకతోనే వినికిడి లోపంతో బాధపడుతున్నప్పటికీ, ఈ లోపాన్ని ఏమాత్రం లెక్కచేయకుండా, తన లక్ష్యాన్ని షూటింగ్‌పై కేంద్రీకరించి దేశానికి గర్వకారణంగా నిలిచాడు.

25వ సమ్మర్ డెఫ్లింపిక్స్ 2025 (బధిరుల ఒలింపిక్స్) లో భాగంగా జపాన్‌లోని టోక్యో వేదికగా జరిగిన పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ధనుష్ శ్రీకాంత్ స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నాడు. ఈ పతకంతో భారత్‌కు డెఫ్లింపిక్స్‌లో పతకాల ఖాతాను తెరిచాడు. క్వాలిఫికేషన్ రౌండ్‌లోనే అద్భుతంగా రాణించిన ధనుష్, ఫైనల్స్‌లోనూ తన గురితో అదరగొట్టి వరల్డ్ రికార్డును (252.2 పాయింట్లు) నెలకొల్పాడు. ఇదే విభాగంలో భారత్‌కు చెందిన మరో షూటర్ మహ్మద్ వానియా రజత పతకం సాధించడం విశేషం.

ధనుష్ శ్రీకాంత్ 2021లో జరిగిన 24వ డెఫ్లింపిక్స్‌లో కూడా స్వర్ణాన్ని గెలుచుకుని తన టైటిల్‌ను విజయవంతంగా కాపాడుకున్నాడు. గగన్ నారంగ్ ‘గన్ ఫర్ గ్లోరీ’ అకాడమీలో శిక్షణ పొందిన ధనుష్, అంతర్జాతీయ స్థాయిలో అసాధారణ ప్రదర్శనతో ఎదిగాడు. ఈ ఘన విజయం సాధించినందుకు తెలంగాణ ప్రభుత్వం క్రీడా పాలసీ (Sports Policy) ప్రకారం ధనుష్ శ్రీకాంత్‌కు కోటి 20 లక్షల రూపాయల భారీ నజరానాను ప్రకటించింది. ప్రతిభకు వైకల్యం అడ్డురాదని ధనుష్ శ్రీకాంత్ నిరూపించాడని క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి కొనియాడారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana