
DNews 15 Nov:తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తున్న బెట్టింగ్ యాప్స్ (Betting Apps) ప్రమోషన్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తు ముమ్మరం చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన కేసులో పలువురు సినీ, టీవీ ప్రముఖులకు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ దర్యాప్తులో భాగంగా, సినీ నటుడు రానా దగ్గుబాటి మరియు టీవీ యాంకర్ విష్ణుప్రియ శనివారం (నవంబర్ 15, 2025) హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు.
