
DET:NOV 15:
బీస్ట్ మోడ్ షురూ! షూటింగ్ కి సిద్ధమైన ఎన్టీఆర్:
యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు శుభవార్త! కెజిఎఫ్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ త్వరలో మళ్ళీ మొదలు కానుంది.ఈ సినిమాకు సంబంధించిన వర్కింగ్ టైటిల్ #NTRNeel లేదా డ్రాగన్ అని ప్రచారంలో ఉంది.ఇటీవల,మేకర్స్ ఒక పోస్ట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు.ఎన్టీఆర్ మేకోవర్ సెషన్లో ఉన్న ఒక ఫోటోను షేర్ చేస్తూ,The beast mode is about to ignite again.#NTRNEEL next schedule begins soon.” మళ్ళీ మండడానికి సిద్ధంగా ఉంది.#NTRNeel తదుపరి షెడ్యూల్ త్వరలో ప్రారంభమవుతుంది అని పేర్కొన్నారు.
క్రియేటివ్ డిఫరెన్సులపై వచ్చిన పుకార్లు:
ఈ సినిమా షూటింగ్ ఆగిపోయిందని,దానికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ మరియు హీరో ఎన్టీఆర్ మధ్య కథ విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయని కొన్ని పుకార్లు వచ్చాయి.వార్ 2 ఫలితం తర్వాత,తన తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఎన్టీఆర్ చాలా జాగ్రత్తగా ఉన్నారని,అందుకే స్క్రిప్ట్‌ను మార్చమని అడిగాడని కూడా వార్తలు వచ్చాయి.అయితే,మేకర్స్ తాజా అప్డేట్తో ఈ వార్తలకు తెరదించారు.ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం నాణ్యతను పెంచడం కోసమే తప్ప,వేరే ఏ సమస్యలు లేవని స్పష్టం చేశారు.
ఎన్టీఆర్ కొత్త లుక్ – అభిమానుల్లో ఉత్సాహం:
మేకర్స్ విడుదల చేసిన ఫోటోలో ఎన్టీఆర్ వెనుక నుండి కనిపిస్తున్నారు,అతని ముఖం పూర్తిగా కనిపించకపోయినా,ఆయన కొత్త మేకోవర్ కోసం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది.ఈ లుక్ అతని పాత్రకు సరిపోయే విధంగా కొత్తగా ఉంటుందని సమాచారం.సలార్,కేజీఎఫ్ వంటి భారీ యాక్షన్ చిత్రాలకు పేరుగాంచిన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించడం, దానికి తోడు ఎన్టీఆర్ కొత్త లుక్ కోసం సన్నద్ధం అవుతుండడంతో అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి చేరాయి.ఈ సినిమా జూన్ 25,2026 న విడుదలయ్యే అవకాశం ఉంది.
పాన్-ఇండియా రేంజ్లో భారీ ప్లానింగ్:
ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రశాంత్ నీల్ తనదైన మాస్ యాక్షన్ స్టైల్‌తో,ఎన్టీఆర్ తన అద్భుతమైన నటనతో ఈ సినిమాను ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక మైలురాయిగా నిలపాలని చూస్తున్నారు.హీరోయిన్గా రుక్మిణి వసంత్ పేరు కూడా ప్రచారంలో ఉంది.ఈ సినిమా పాన్-ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది.
