
DSports 15 Nov:ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) సంచలన నిర్ణయం తీసుకుంది. జట్టులో సుదీర్ఘకాలం పాటు కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను ట్రేడింగ్ ద్వారా వదులుకుంది. జడేజా మరియు సామ్ కరన్‌లను రాజస్థాన్ రాయల్స్‌కు ఇచ్చి, ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ను తమ జట్టులోకి తీసుకుంది.
ఈ అనూహ్య మార్పుపై, ముఖ్యంగా 12 ఏళ్లుగా చెన్నైకి విధేయతగా ఉన్న జడేజాను వదులుకోవడంపై, సీఎస్‌కే అభిమానుల నుంచి వస్తున్న తీవ్ర నిరాశ మరియు విమర్శల నేపథ్యంలో, సీఎస్‌కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించారు.
