
DET:NOV 15:
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒకప్పటి స్టార్ జోడీ,రామకృష్ణ మరియు రాజశేఖర్ మళ్ళీ కలిసి నటించబోతున్నారు.దాదాపు 27 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత వీరిద్దరూ కలిసి ఒక సినిమాలో కనిపించబోతుండటం అభిమానులకు ఎంతో ఉత్సాహాన్నిస్తోంది.
27 ఏళ్ల తర్వాత మళ్లీ జోడీ:
90వ దశకంలో రాజశేఖర్,రమ్యకృష్ణ కాంబినేషన్ అంటే ప్రేక్షకులకు ఒక క్రేజ్ ఉండేది.వీరిద్దరూ కలిసి నటించిన అల్లరి ప్రియుడు,బలరామకృష్ణులు వంటి చిత్రాలు అప్పట్లో చాలా పెద్ద హిట్‌గా నిలిచాయి.చివరగా 1990లలో వీరు కలిసి నటించిన తర్వాత,ఇన్నాళ్ళకు మళ్లీ ఒకే సినిమాలో కనిపించనున్నారు.ఈ రీ-యూనియన్ గురించి వార్త వినగానే పాత సినిమా అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు.
లబ్బర్ పంధు రీమేక్‌లో నటన:
వీరిద్దరూ కలిసి నటిస్తున్న సినిమా తమిళంలో మంచి విజయం సాధించిన లబ్బర్ పంధు అనే స్పోర్ట్స్ డ్రామాకి తెలుగు రీమేక్.ఈ సినిమా కథ క్రికెట్ నేపథ్యంతో నడుస్తుంది.తమిళ్లో 2024లో విడుదలైన ఈ చిత్రం,ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.ఈ సినిమా రీమేక్ హక్కులను రాజశేఖర్ కొనుగోలు చేశారు.
దర్శకత్వ బాధ్యతలు:
ఈ తెలుగు రీమేక్‌కి ప్రముఖ దర్శకుడు ఐ.వి.శశి గారి కొడుకు అయిన అని ఐ.వి.శశి దర్శకత్వం వహిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ కూడా ఇటీవలే హైదరాబాద్‌లో మొదలైందని సమాచారం.ఈ సినిమాలో రాజశేఖర్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, రమ్యకృష్ణ ఆయనకి జోడీగా కనిపించనున్నారు.
రాజశేఖర్ కుమార్తె కూడా:
ఈ చిత్రానికి మరో ప్రత్యేక ఆకర్షణ ఏంటంటే,రాజశేఖర్ కూతురు కూడా ఇందులో ఒక పాత్రలో నటిస్తున్నారు.ఆమె తెరపై రాజశేఖర్ కూతురి పాత్రనే పోషిస్తున్నట్లు తెలుస్తోంది.అలాగే,35 చిన్న కథ కాదు ఫేమ్ విశ్వదేవ్ రాచకొండ కూడా ఈ చిత్రంలో ఒక ముఖ్యపాత్ర చేస్తున్నారు.ఈ క్రికెట్ డ్రామాలో ఒకప్పటి స్టార్ జోడీని మళ్ళీ చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
