DET:NOV 15:
ముల్లంగి:ఆరోగ్యానికి మంచిదే… కానీ వీటితో కలిపి తింటే ప్రమాదమే!
శీతాకాలంలో లభించే ముల్లంగి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.దీనిని తరచుగా ఆహారంలో భాగం చేసుకోవడం మంచిది.ఇందులో నీటి శాతం ఎక్కువగా ఉండటం వలన శరీరానికి అవసరమైన తేమ అందుతుంది.అంతేకాకుండా, ముల్లంగిలో ఫైబర్,విటమిన్ సి వంటి అనేక పోషకాలు పుష్కలంగా ఉంటాయి.ఇవి మన జీర్ణవ్యవస్థకు సహాయపడతాయి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ముల్లంగి ఎంత ఆరోగ్యకరమైనదైనా,కొన్ని ఆహార పదార్థాలతో కలిపి తినడం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ముల్లంగి – దోసకాయ:

ముల్లంగిని దోసకాయతో కలిపి తినకూడదు అని ఆహార నిపుణులు సూచిస్తుంటారు.ముల్లంగికి,దోసకాయకు రెండింటికీ విభిన్నమైన జీర్ణ సమయాలు ఉంటాయి.ఈ రెండింటిని కలిపి తీసుకున్నప్పుడు,జీర్ణక్రియలో సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. దీనివల్ల కడుపు ఉబ్బరం లేదా గ్యాస్ వంటి సమస్యలు ఎదురుకావచ్చు.

ముల్లంగి – పాలు:
పాలు మరియు పాల పదార్థాలతో ముల్లంగిని కలిపి తీసుకోవడం కూడా శరీరానికి మంచిది కాదు.ముల్లంగిలో ఉండే కొన్ని సమ్మేళనాలు పాలలో ఉండే పోషకాలతో కలిసి ప్రతికూలంగా మారవచ్చు.ముఖ్యంగా,పాలు తాగిన వెంటనే లేదా ముందు ముల్లంగిని తినడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని కొన్ని సంప్రదాయ వైద్య విధానాలు చెబుతున్నాయి.కాబట్టి,ముల్లంగి తిన్న తర్వాత కొంత సమయం విరామం ఇచ్చి పాలు తీసుకోవడం మంచిది.

ముల్లంగి – నారింజ :
ముల్లంగిని నారింజ లేదా ఇతర సిట్రస్ పండ్లతో కలిపి తినకూడదు.ముల్లంగి సహజంగా కొంచెం వేడి చేసే గుణాన్ని కలిగి ఉంటుంది.దీనిని సిట్రస్ పండ్లలోని ఆమ్లత్వం తో కలిపినప్పుడు,అది జీర్ణవ్యవస్థలో అసమతుల్యతకు దారితీయవచ్చు.ఈ కాంబినేషన్ కారణంగా కడుపు నొప్పి లేదా గుండెల్లో మంట వంటి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంటుంది.