DET:NOV 15:
లోకహ్ నటి కల్యాణి ప్రియదర్శన్: దుల్కర్ సల్మాన్ కాంత నాకెంతో ఇష్టం:
లోకహ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించిన నటి కల్యాణి ప్రియదర్శన్,తాజాగా విడుదలైన దుల్కర్ సల్మాన్ పీరియాడిక్ డ్రామా కాంత పై ప్రశంసలు కురిపించారు.సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తనను ఎంతగానో కదిలించిందని ఆమె అన్నారు.సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాన్ని పంచుకుంటూ,దుల్కర్ సల్మాన్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.

దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఇదే నా ఫేవరెట్ పెర్ఫార్మెన్స్!
నిజం చెప్పాలంటే,దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే నాకు బాగా నచ్చిన నటన ఇది కావచ్చు.నన్ను బాగా తెలిసిన వారికి ఇది చాలా పెద్ద విషయం అని కల్యాణి ప్రియదర్శన్ రాసుకొచ్చారు.ఈ సినిమా గురించి దాదాపు ఏమీ తెలియకుండా చూడటానికి వెళ్ళాను,కానీ చాలా కదిలిపోయి బయటకు వచ్చాను అని ఆమె తెలిపారు.సినిమా తనపై ఎంత ప్రభావం చూపిందో ఈ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

తమిళం మాట్లాడితే ఎక్స్‌ట్రా ఎక్సైట్ అవుతాను:
దుల్కర్‌ సల్మాన్ తమిళంలో మాట్లాడితే తనకు మరింత ఆనందం కలుగుతుందని కల్యాణి పంచుకున్నారు.ఆయనకు ఆ భాష ఎంత ఇష్టమో,ఆ అనుబంధం ఎంత లోతైనదో నాకు తెలుసు అని అన్నారు.దుల్కర్ చెన్నైలో పెరగడం వల్ల మలయాళం కంటే తమిళమే బాగా మాట్లాడతారని చాలా మంది అంటారని,ఈ విషయాన్ని కల్యాణి కూడా ప్రేమగా అంగీకరించారు.

సహ నటీనటులు,సాంకేతిక నిపుణులపై ప్రశంసలు:
దుల్కర్‌తో పాటు ఇతర నటీనటులు,సాంకేతిక నిపుణులను కూడా కల్యాణి అభినందించారు.సమూతిరకణి డైలాగులను చూసి కూడా చాలా చప్పట్లు కొట్టానని చెప్పారు.అలాగే,నటి భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రెజెన్స్‌ను పొగుడుతూ,నువ్వు తెరపై ఎక్కడ ఉన్నా నా కళ్లు నీపైనే ఉంటాయి అని రాశారు.రానా దగ్గుబాటి గురించి మాట్లాడుతూ,మీరు బాగా చేసే పనిని చూడటం నాకు ఎల్లప్పుడూ ఇష్టం అని తెలిపారు.చివరగా,దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్,సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్‌తో పాటు సినిమాకు మనస్ఫూర్తిగా కష్టపడిన ప్రతి ఒక్కరికీ శుభాకాంక్షలు చెప్పారు.