
DET:NOV 14:
అదా శర్మ: వైవిధ్యమైన పాత్రలకే నా ప్రాధాన్యత!
అదా శర్మ లుగు ప్రేక్షకులకు హార్ట్ ఎటాక్ సినిమాతో పరిచయమైన ఈ బ్యూటీ,ఇటీవల కాలంలో తన సినిమాల ఎంపికతో జాతీయ స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.గ్లామర్ పాత్రలతో పాటు,సాహసం,భావోద్వేగం నిండిన పాత్రలను ఎంచుకుంటూ ఆమె తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.ముఖ్యంగా,ది కేరళ స్టోరీ,బస్తర్:ది నక్సల్ స్టోరీ వంటి చిత్రాల విజయాల తర్వాత ఆమె కెరీర్ మలుపు తిరిగింది.
ది కేరళ స్టోరీ అనుభవాలు:
సినిమా తనకు ఎంతో గుర్తింపు తెచ్చినప్పటికీ,ఆ సినిమా విడుదలైన సమయంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి అదా శర్మ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకుంది.ప్రారంభంలోనే 1920 వంటి సాహసోపేతమైన సినిమాను అంగీకరించాను. కానీ ది కేరళ స్టోరీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు దేశంలో సగం మంది నన్ను చంపాలనుకున్నారు,మిగతా సగం మంది నాపై ప్రేమను చూపించి,నన్ను రక్షించారు అని ఆమె అన్నారు.ఈ సంచలన చిత్రం తర్వాత బస్తర్:ది నక్సల్ స్టోరీ సమయంలో కూడా తనకు బెదిరింపులు వచ్చాయని అదా తెలిపారు.
కొత్త సినిమా విశేషాలు:
ప్రస్తుతం అదా శర్మ వైవిధ్యభరితమైన ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది.ఆమె తెలుగులో C.D: క్రిమినల్ ఆర్ డెవిల్ అనే హారర్, సస్పెన్స్,థ్రిల్లర్ చిత్రంతో సుమారు ఐదేళ్ల తర్వాత రీ-ఎంట్రీ ఇవ్వడం విశేషం.ఈ చిత్రంలో ఆమె రెండు విభిన్నమైన పాత్రలలో కనిపిస్తారని తెలుస్తోంది.అలాగే,హిందీలో తుమ్కో మేరీ కసమ్ అనే బయోపిక్ తరహా చిత్రంలో నటిస్తున్నారు.ఇది కాకుండా,రీటా సన్యాల్ సీజన్ 2 అనే లీగల్ డ్రామా వెబ్ సిరీస్‌లో కూడా ఆమె నటిస్తున్నారు.హాటక్ అనే క్రైమ్ థ్రిల్లర్ సినిమా కూడా ఆమె రాబోయే ప్రాజెక్టులలో ఉంది.
ఛాలెంజింగ్ రోల్స్‌పైనే ఇష్టం:
స్క్రిప్ట్ ఎంపిక గురించి అదా శర్మ తన అభిప్రాయాన్ని స్పష్టం చేశారు.రిస్క్ ఉన్న పాత్రలు చేసినప్పుడే కెరీర్‌కు విలువ పెరుగుతుంది.పాత్రలో భావోద్వేగం,యాక్షన్ సన్నివేశాలు ఉండాలి.చాలెంజింగ్‌గా ఉండే రోల్స్ చేయడానికే నేను ఇష్టపడతాను.తేలికపాటి పాత్రలు చేయడం నాకు నచ్చదు.అలాంటి పాత్రలు చేస్తేనే నేను ఆనందిస్తాను.కొన్నిసార్లు నా కుటుంబం ఆందోళన చెందుతుంది,కానీ నేను సంతోషంగా ఉంటాను అని ఆమె తెలిపారు.
