
DET:SEP12:బాలీవుడ్ & సౌత్ నటీమణి హాన్సికా మోత్వానీపై న్యాన్స్ జేమ్స్ చేసిన ఆరోపణలు.
కేసు నేపథ్యం
హాన్సికా మోత్వానీ అన్నయ్య ప్రషాంత్ మోత్వానీ పైన అతని భార్య న్యాన్సీ జేమ్స్, 2023 డిసెంబర్లో పోలీసులకు FIR ఇచ్చారు.ఆమె ఫిర్యాదులో, హాన్సికా మరియు ఆమె తల్లి జ్యోతి మోత్వానీ తన దగ్గర డౌరీ డిమాండ్ చేశారని,
తనను క్రూరత్వం చూపుతూ వేధించారని,అలాగే మానసికంగా మరియు శారీరకంగా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.
ఆరోపణల ప్రకారం, న్యాన్సీ జేమ్స్ తీవ్ర మానసిక ఒత్తిడి, వేధింపుల కారణంగా బెల్స్ పాల్సీ అనే వ్యాధికి గురయ్యానని చెప్పారు.
న్యాయ వ్యవహారం
హాన్సికా మరియు ఆమె తల్లి ముంబై సెషన్స్ కోర్టు ద్వారా ముందస్తు బెయిల్ పొందారు,తరువాత, హాన్సికా మోత్వానీ హై కోర్టులో FIR ను రద్దు చేయాలని అభ్యర్థించారు, కానీ బాంబే హై కోర్టు ఆ దాఖలు తిరస్కరించింది,అంటే FIR అమల్లోనే ఉంటుంది మరియు విచారణ న్యాయ ప్రక్రియ కొనసాగుతుంది.
ప్రస్తుత పరిస్థితి
ఈ వ్యవహారం బయటకు రావడంతో మీడియా, సోషల్ మీడియాలో పెద్ద చర్చ మొదలైంది.
అభిమానుల మధ్య కూడా ఈ విషయం హాట్ టాపిక్ అయ్యింది.
ఇదే సమయంలో, హాన్సికా తన ప్రతిష్ట,పేరు చెడిపోకుండా కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
