D Spiritual: Nov 13: హిందువులు ఎక్కువగా పూజించే దేవతలలో లక్ష్మీదేవి ఒకరు. లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఐశ్వర్యం, అదృష్టం సిద్ధించే అవకాశాలు ఉంటాయి. హిందువులు లక్ష్మీదేవిని సంపదకు దేవతగా భావిస్తారు. ఉపవాసం చేసి లక్ష్మీదేవిని పూజించడం, ముఖ్యంగా శుక్రవారం రోజున పూజించడం ద్వారా శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు చేకూరుతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఉద్యోగ, వ్యాపార రంగాలలో సులువుగా రాణించే అవకాశాలు ఉంటాయి.

లక్ష్మీదేవిని పూజించడానికి ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్య సమయం చాలా శుభప్రదం. ఈ సమయంలో పూజించడం ద్వారా ఊహించని స్థాయిలో ప్రయోజనాలు చేకూరుతాయి. పూజ చేసేవారు శుభ్రమైన దుస్తులను ధరించి, ఎర్రని వస్త్రంపై అమ్మవారి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి పూజించాలి. శ్రీ యంత్రాన్ని కూడా పూజలో ఉంచి, నెయ్యి దీపాన్ని వెలిగించాలి. అష్ట గంధాన్ని శ్రీ యంత్రం మరియు లక్ష్మీదేవికి తిలకంగా పెట్టాల్సి ఉంటుంది.

పూజా స్థలం విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. పూజ స్థలాన్ని ఈశాన్యంలో నిర్మించడం ద్వారా అనుకూల ఫలితాలు చేకూరుతాయి. అలాగే, లక్ష్మీదేవిని పూజించే పూజ గది ఉన్నచోట వాష్ రూమ్ (మరుగుదొడ్డి) ఉండకూడదు. నియమ నిష్టలతో లక్ష్మీదేవిని పూజించడం ద్వారా అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే కోరుకున్న కోరికలు సైతం సులువుగా నెరవేరే అవకాశాలు ఉంటాయి. అమ్మవారి ఆశీస్సులతో దీర్ఘకాలంలో లక్ష్యాలను సులువుగా సాధించవచ్చు. లక్ష్మీదేవిని పూజించే వాళ్లు ఈ విషయాలను కచ్చితంగా గుర్తుంచుకోవాలి.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana