DET:NOV 13:
ప్రకటనలో ఏముంది?
కొండా సురేఖ తన తంలో ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ,నాగార్జున గారికి సంబంధించి నేను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలనుకుంటున్నాను.నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలనే ఉద్దేశం నాకు లేదు.అక్కినేని నాగార్జున గారిని లేదా ఆయన కుటుంబ సభ్యులను కించపరచాలనే ఉద్దేశం కూడా నాకు లేదు.నా ప్రకటనల వల్ల ఏదైనా అనుకోని అపార్థం లేదా దురుద్దేశ భావన కలిగితే,దానికి నేను చింతిస్తున్నాను మరియు ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను” అని పేర్కొన్నారు.

వివాదానికి కారణం ఏంటి?
గత సంవత్సరం,మంత్రి కొండా సురేఖ రాజకీయ విమర్శలు చేసే క్రమంలో నాగ చైతన్య – సమంత విడాకుల అంశాన్ని ప్రస్తావించారు.ఈ సందర్భంగా ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యలు అక్కినేని కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా ఉన్నాయంటూ తీవ్ర విమర్శలు వచ్చాయి.దీనిపై అప్పట్లో నాగార్జున గారు కూడా స్పందిస్తూ,వ్యక్తిగత విషయాలను గౌరవించాలని,బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నవారు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఖండించారు.

కోర్టులో ఉన్న కేసు:
కొండా సురేఖ వ్యాఖ్యల తర్వాత అక్కినేని నాగార్జున తన కుటుంబ పరువుకు నష్టం కలిగించినందుకు గాను ఆమెపై పరువు నష్టం దావా దాఖలు చేశారు.ఈ కేసు కోర్టులో విచారణలో ఉంది.ఈ నేపథ్యంలో,కోర్టులో విచారణ జరగడానికి కొద్ది రోజుల ముందు మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలపై చింతిస్తూ,వాటిని ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం గమనార్హం.

తదుపరి పరిణామాలు ఏంటి?

మంత్రి కొండా సురేఖ ఈ ప్రకటన చేసిన తర్వాత,నాగార్జున కుటుంబం కోర్టులో దాఖలు చేసిన పరువు నష్టం దావా విషయంలో ఎలా స్పందిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.ఈ క్షమాపణతో ఈ వివాదం ఒక కొలిక్కి వస్తుందా,లేక న్యాయ పోరాటం కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.