DET:NOV 12:
రాజ్ తరుణ్ ‘పాంచ్ మినార్’ విడుదల తేదీ ఖరారు:
యంగ్ హీరో రాజ్ తరుణ్ నటించిన తాజా చిత్రం పాంచ్ మినార్ విడుదల తేదీ ఖరారైంది.ఈ క్రైమ్ కామెడీ ఎంటర్‌టైనర్ నవంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ విషయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.ఇప్పటికే విడుదలైన పాటలు,టీజర్‌కు మంచి స్పందన రావడంతో,సినిమాపై అంచనాలు పెరిగాయి.

క్రైమ్ కామెడీ నేపథ్యం:
పాంచ్ మినార్ చిత్రాన్ని క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కించారు.ఈ సినిమాకు రామ్ కడుముల దర్శకత్వం వహించారు. సినిమాలో రాజ్ తరుణ్ పాత్ర సరికొత్తగా,వినోదభరితంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.కథ,కథనం ఆద్యంతం నవ్వులు పూయించేలా,ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించేలా ఉంటుందని తెలుస్తోంది.

నటీనటులు,సాంకేతిక నిపుణులు:
ఈ చిత్రంలో రాజ్ తరుణ్ సరసన రాశి సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది.ముఖ్యపాత్రల్లో అజయ్ ఘోష్,బ్రహ్మాజీ, శ్రీనివాస్ రెడ్డి,నితిన్ ప్రసన్న,రవి వర్మ వంటి నటులు కనిపిస్తారు.కనెక్ట్ మూవీస్ LLP బ్యానర్‌పై మాధవి,MSM రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు.గోవింద రాజు సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. శేఖర్ చంద్ర సంగీతం అందించగా,ఆదిత్య జవ్వాది సినిమాటోగ్రాఫర్‌గా,ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా పనిచేశారు.

పెరిగిన అంచనాలు:

సినిమా టీజర్,ఫస్ట్ సింగిల్ ఏం బతుకురా నాది పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.ఈ పాట మధ్యతరగతి జీవితాన్ని ప్రతిబింబించేలా ఉండటంతో,చాలా మందికి కనెక్ట్ అయింది.టీజర్‌లో కనిపించిన కామెడీ టైమింగ్,రాజ్ తరుణ్ ఎనర్జిటిక్ లుక్ సినిమా విజయంపై చిత్ర బృందానికి నమ్మకాన్ని పెంచాయి.ఈ నవంబర్ 21న థియేటర్లలోకి రాబోతున్న పాంచ్ మినార్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.