
DSports 12 Nov:“జడేజా, కరన్ వెళ్లిపోతే చెన్నై తమ జట్టును తప్పకుండా బలోపేతం చేసుకోవాలి. నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ వంద శాతం సీఎస్కే రాడార్లో ఉంటారు. వెంకటేశ్ అయ్యర్ శివమ్ దూబే తరహాలో ఉన్నప్పటికీ, అతను స్వీప్, రివర్స్ స్వీప్ ఆడగలడు. ఇక నితీశ్ రాణా అయితే స్క్వేర్ బౌండరీలను సులభంగా కొట్టగలడు. అందుకే వీరిద్దరూ సీఎస్కేకు అత్యంత ఆకర్షణీయమైన ఎంపికలు,” అని అశ్విన్ వివరించాడు.
ఐపీఎల్ 2026 మినీ వేలం డిసెంబర్ మూడో వారంలో జరిగే అవకాశం ఉంది. నవంబర్ 15 లోపు ఫ్రాంచైజీలు తాము రిటైన్ చేసుకునే ఆటగాళ్ల తుది జాబితాను ప్రకటించాల్సి ఉంది.
