
DSports 10 Nov:టీమిండియా యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ అభిషేక్ శర్మ ఇటీవల కాలంలో కనబరుస్తున్న నిలకడైన ప్రదర్శన, ముఖ్యంగా ఆస్ట్రేలియాపై ముగిసిన టీ20 అంతర్జాతీయ (T20I) సిరీస్‌లో అతని నిర్భయమైన ఆట తీరుకు ఇంగ్లండ్ దిగ్గజ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ ఫిదా అయ్యాడు.
ఆస్ట్రేలియాపై భారత్ 2-1 తేడాతో సిరీస్ గెలిచిన తర్వాత, అభిషేక్ శర్మ ఆట తీరుపై పీటర్సన్ తన అధికారిక ‘X’ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. “ఇందులో నాకు ఆశ్చర్యం ఏమీ లేదు. అభిషేక్ టీ20 క్రికెట్‌లో అత్యంత పూర్తిస్థాయి ఓపెనింగ్ బ్యాటర్ (Most complete opening batter). అతను నిర్భయంగా, ధైర్యంగా, ప్రతిభతో ఆడుతున్నాడు!” అని పీటర్సన్ ప్రశంసించారు.
