DET:NOV 10:
నటదిగ్గజం సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి నిమాలో జెమినీ గణేశన్ పాత్రలో నటించడానికి మొదట్లో దుల్కర్ సల్మాన్ చాలా భయపడ్డారని,దర్శకుడు నాగ్ అశ్విన్ నచ్చచెప్పాకే ఆ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారని ఇటీవల జరిగిన ఒక సక్సెస్ మీట్‌లో నాగ్ అశ్విన్ గుర్తు చేసుకున్నారు.

మహానటి చేయనని చెప్పిన దుల్కర్:
మలయాళంలో ఇప్పటికే స్టార్‌గా ఉన్న దుల్కర్‌ని మహానటి జెమినీ గణేశన్ పాత్ర కోసం అడగడానికి నాగ్ అశ్విన్ చెన్నై వెళ్ళారు.అప్పుడు దుల్కర్,నాకు తెలుగు రాదు ప్రేక్షకులు నన్ను అంగీకరిస్తారా?నేను సరిగ్గా మాట్లాడలేనని అనుకుంటారేమో? అని తన భయాన్ని,సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఈ సినిమా చేయనని చెప్పడానికి సిద్ధపడ్డారట.ఈ పాత్ర చేయడంలో ఆయనకు భాషాపరమైన భయం ఎక్కువగా ఉండేది.

నాగ్ అశ్విన్ నమ్మకమే మార్పు:
అయితే,దర్శకుడు నాగ్ అశ్విన్ పదే పదే నచ్చజెప్పడంతో,ఆ పాత్ర యొక్క ప్రాముఖ్యతను వివరించడంతో దుల్కర్ చివరకు ఒప్పేసుకున్నారు.తనపై పెట్టుకున్న ఆ నమ్మకమే ఆయన కెరీర్‌ని మలుపు తిప్పింది.మహానటి జెమినీ గణేశన్‌గా దుల్కర్ నటన విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక,ఆయనకు తెలుగు ప్రేక్షకులలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు తెలుగు సూపర్ స్టార్:
నాగ్ అశ్విన్ ఇటీవల లక్కీ భాస్కర్ సక్సెస్ మీట్‌లో మాట్లాడుతూ,దుల్కర్ ఆ రోజు తెలుగులో నటించలేనని అన్నాడు.కానీ, ఆరేళ్ళు,మూడు బ్లాక్‌బస్టర్ హిట్ల తర్వాత,ఇప్పుడు చాలా మంది కంటే కూడా ఆయనొక తెలుగు సూపర్ స్టార్ అయ్యాడు,అని సంతోషం వ్యక్తం చేశారు.దుల్కర్ సల్మాన్ ఈ ప్రయాణాన్ని చూసి నాగ్ అశ్విన్ గర్వంగా ఉందని చెప్పారు.మహానటి ర్వాత సీతారామంతో కూడా దుల్కర్‌కు తెలుగులో అద్భుతమైన విజయం లభించింది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana