DET:NOV 10:
నటి రుక్మిణి వసంత్ హెచ్చరిక: మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండండి!
నటి రుక్మిణి వసంత్ తన పేరు మీద నకిలీ నంబర్ ద్వారా కొందరు మోసాలకు పాల్పడుతున్నారని, దానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆమె స్వయంగా సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.ఇది సైబర్ నేరం కిందకు వస్తుందని ఆమె స్పష్టం చేశారు.

“ఆ నంబర్ నాది కాదు” – స్పష్టత ఇచ్చిన నటి:
సోషల్ మీడియాలో ఒక మొబైల్ నంబర్‌ను ప్రస్తావిస్తూ,దయచేసి గమనించండి: ఈ నంబర్ నాకు సంబంధించినది కాదు. దీని నుండి వచ్చే మెసేజ్‌లు లేదా కాల్స్‌ పూర్తిగా నకిలీవి.ఎవరూ స్పందించవద్దు లేదా సంప్రదించవద్దు అని రుక్మిణి వసంత్ ఒక ప్రకటన విడుదల చేశారు.తన పేరును ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

సైబర్ నేరంపై చర్యలు,పోలీసుల స్పందన:

ఈ మోసపూరిత చర్యను సైబర్ నేరంగా పరిగణించి,సంబంధిత వ్యక్తులపై తగిన న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు రుక్మిణి తెలిపారు.ఈ విషయంపై బెంగళూరు నగర పోలీసులు కూడా స్పందించారు.వారు,ఇవి మోసగాళ్ల కాల్స్/సందేశాలు. దయచేసి ఎలాంటి సమాచారం పంచుకోవద్దు.తగిన చర్యల కోసం దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయండి అని ప్రజలకు సూచించారు.

అనుమానాలుంటే అధికారికంగా సంప్రదించండి:
ఎవరికైనా తన గురించి ఏమైనా సందేహాలు ఉంటే,నేరుగా తన టీమ్‌ను లేదా తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా సంప్రదించాలని రుక్మిణి కోరారు.ఇలాంటి నకిలీ కమ్యూనికేషన్ల పట్ల ఎవరూ మోసపోవద్దని,అప్రమత్తంగా ఉండాలని నటి విజ్ఞప్తి చేశారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana