
DET:NOV 09:
శ్రద్ధా కపూర్ జూడీ హాప్స్కు డబ్బింగ్: జూటోపియా 2 హిందీ వెర్షన్‌పై తాజా వార్త:
బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ డిస్నీ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న యానిమేషన్ చిత్రం జూటోపియా 2 హిందీ వెర్షన్లో ప్రధాన పాత్ర జూడీ హాప్స్కు తన గాత్రాన్ని అందించబోతున్నారు.ఈ వార్తను డిస్నీ ఇండియా అధికారికంగా ప్రకటించడంతో అభిమానులంతా చాలా సంతోషంగా ఉన్నారు.బాఘీ,స్త్రీ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న శ్రద్ధా, ఇప్పుడు తన స్వీట్ వాయిస్‌తో జూడీ హాప్స్ పాత్రకు మరింత ప్రాణం పోయనున్నారు.
శ్రద్ధా కపూర్ సంతోషం:
ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై శ్రద్ధా కపూర్ తన ఉత్సాహాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.నేను #Zootopia2 కుటుంబంలో చేరడం చాలా సంతోషంగా ఉంది.అద్భుతమైన జూడీ హాప్స్ పాత్రకు హిందీలో వాయిస్ ఇవ్వబోతున్నాను. ఆమె ధైర్యవంతురాలు,ఉత్సాహవంతురాలు,ముఖ్యంగా చిన్నప్పటి నుంచీ చాలా ముద్దుగా ఉంటుంది అని ఆమె పోస్ట్ చేశారు. ఆమె వాయిస్ జూడీ పాత్ర యొక్క ఆత్మవిశ్వాసం,చురుకుదనం మరియు అమాయకత్వాన్ని భారతీయ ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తుందని చిత్ర యూనిట్ నమ్మకంగా ఉంది.
జూటోపియా 2 గురించి వివరాలు
జూటోపియా మొదటి భాగం 2016లో విడుదలై ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయాన్ని సాధించింది.ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది.ఈ సీక్వెల్ జూటోపియా 2,జూడీ హాప్స్ మరియు ఆమె నక్క భాగస్వామి నిక్ వైల్డ్ మళ్లీ కలిసి కొత్త, థ్రిల్లింగ్ కేసును పరిష్కరించేందుకు బయలుదేరుతారు.ఈసారి వారి దర్యాప్తులో గ్యారీ అనే పాము కీలక అనుమానితుడిగా కనిపిస్తుంది.యాక్షన్,కామెడీ మరియు ఎమోషన్స్ కలగలిసిన ఈ సినిమా నవంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా,భారత్‌లో కూడా ఇంగ్లీష్,హిందీ,తమిళం మరియు తెలుగు భాషల్లో విడుదల కానుంది.
ప్రేక్షకుల స్పందన:
శ్రద్ధా కపూర్ వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్‌గా రావడం ఆమె అభిమానులకు మరింత ప్రత్యేకమైన విషయం.ఆమె స్వరం జూడీ హాప్స్ పాత్రకు సరిగ్గా సరిపోతుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు.హిందీ వెర్షన్‌ను కూడా అద్భుతంగా తీర్చిదిద్దడానికి డిస్నీ తీసుకున్న ఈ నిర్ణయం భారతీయ ప్రేక్షకులకు ఈ సినిమాను మరింత దగ్గర చేస్తుందని భావిస్తున్నారు.ఈ యానిమేటెడ్ అడ్వెంచర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
