DET:NOV 07:
కమల్ హాసన్ పుట్టినరోజు: లెజెండ్ తో కలిసి పనిచేయడంపై ప్రభాస్ ఉత్సాహం!
కల్కి 2898 AD సినిమాతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ప్రభాస్ మరియు కమల్ హాసన్,ఈ సినిమా సీక్వెల్‌లో మళ్లీ కలవబోతున్నారు.

ప్రభాస్ హృదయపూర్వక శుభాకాంక్షలు:
కమల్ హాసన్ 71వ పుట్టినరోజు సందర్భంగా,ప్రభాస్ సోషల్ మీడియాలో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.ఒక పాత బ్లాక్ అండ్ వైట్ ఫోటోను షేర్ చేస్తూ ప్రభాస్,కమల్ సర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు.మీలాంటి లెజెండ్ తో పనిచేయడం నా అదృష్టం. తదుపరి భాగంలో మిమ్మల్ని సెట్‌లో కలవడానికి ఎదురుచూస్తున్నాను అని రాశారు.

కల్కి లో కమల్ పాత్ర – రెండవ భాగంపై అంచనాలు:
కల్కి 2898 AD లో కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ అనే శక్తివంతమైన పాత్ర పోషించారు.మొదటి భాగంలో ఆయన పాత్ర కొద్ది సమయమే కనిపించినప్పటికీ,దాని ప్రభావం బలంగా ఉంది.దర్శకుడు నాగ్ అశ్విన్ చెప్పినట్లుగా,రెండవ భాగంలో కమల్ హాసన్ పాత్ర మరింత కీలకంగా,ప్రధానంగా ఉండబోతోంది.

ప్రేక్షకుల ఆనందం – యూనిట్ స్పందన:
కల్కి 2898 AD బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది.ఈ సందర్భంగా,కమల్ హాసన్ లాంటి గొప్ప నటుడితో పనిచేయడం తనకి దక్కిన గొప్ప గౌరవంగా ప్రభాస్ భావించారు.కమల్ హాసన్ కూడా సినిమాను అభిమానిలా చూశానని,దర్శకుడు నాగ్ అశ్విన్ ఈ భారీ ప్రాజెక్టును అద్భుతంగా హ్యాండిల్ చేశారని మెచ్చుకున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana