
DET:NOV 07:
బాలీవుడ్ దంపతులు విక్కీ కౌశల్,కత్రినా కైఫ్ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు.ఈ సంతోషకరమైన వార్తను వారు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.
ఆనందాన్ని పంచుకున్న విక్కీ,కత్రినా:
బాలీవుడ్ ప్రముఖ జంట విక్కీ కౌశల్ మరియు కత్రినా కైఫ్ తల్లిదండ్రులయ్యారు. వీరికి పండంటి మగబిడ్డ జన్మించాడు. ఈ శుభవార్తను ఆ దంపతులు శుక్రవారం నవంబర్ 7, 2025 ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఉమ్మడి పోస్ట్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. మా సంతోషాల మూట వచ్చేసింది.అపారమైన ప్రేమ,కృతజ్ఞతతో మా మగబిడ్డను స్వాగతిస్తున్నాము,” అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రత్యేక పోస్ట్‌తో ప్రకటన:
వారందించిన గ్రీటింగ్ కార్డులో Our bundle of joy has arrived.With immense love and gratitude,we welcome our baby boy.7th November,2025. – Katrina & Vicky అని రాసి ఉంది.ఈ పోస్ట్‌కు క్యాప్షన్‌గా విక్కీ మరియు కత్రినా కేవలం Blessed అని మాత్రమే రాశారు.ఈ శుభవార్తను తెలియజేస్తూ వారు పోస్ట్ చేసిన కార్డుపై టెడ్డీ బేర్ బొమ్మ,చుట్టూ స్టార్స్ మరియు బొమ్మల చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
శుభాకాంక్షలు వెల్లువ:
వారు ఈ సంతోషకరమైన వార్తను పంచుకున్న వెంటనే,అభిమానులు,సినీ ప్రముఖులు శుభాకాంక్షలతో కామెంట్ సెక్షన్‌ను నింపేశారు.నిమ్రత్ కౌర్,మనీష్ పాల్,హుమా ఖురేషి వంటి ఎంతోమంది తారలు ఈ జంటకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు.
