DNews:06 NOV:హైదరాబాద్‌ దేశవ్యాప్తంగా ఇంజినీరింగ్‌, ఆర్కిటెక్చర్‌ కోర్సులలో అడ్మిషన్ల కోసం నిర్వహించే జేఈఈ మెయిన్‌ 2026 తొలి విడత పరీక్షకు ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఈసారి పరీక్ష నిర్వహణలో ఎన్‌టీయే (NTA) పెద్ద మార్పులు చేసింది.

తెలంగాణలో ఇప్పటికే ఉన్న హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, సిద్దిపేట‌, జగిత్యాల‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ‌, సూర్యాపేట‌, ఖమ్మం‌, కొత్తగూడెం కేంద్రాలతో పాటు ఆదిలాబాద్‌, పెద్దపల్లి‌, కోదాడ నగరాలను అదనంగా చేర్చింది. దీంతో రాష్ట్రంలో పరీక్ష కేంద్రాల సంఖ్య 14కి పెరిగింది.

అలాగే, దేశవ్యాప్తంగా మొత్తం 33 కొత్త నగరాల్లో జేఈఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎన్‌టీయే ప్రకటించింది.ప్రతీ ఏటా దాదాపు 14 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. అభ్యర్థుల సంఖ్య మరింత పెరగనుందని అంచనా. పరీక్షలో ఈసారి విద్యార్థుల సౌకర్యార్థం కంప్యూటర్ స్క్రీన్‌పై ఫాంట్ సైజు, డయాగ్రామ్ పరిమాణం పెంచుకునే అవకాశం కల్పించనున్నారు.

ప్రధాన తేదీలు:

  • ఆన్‌లైన్‌ దరఖాస్తు: నవంబర్‌ 27 వరకు
  • తొలి విడత పరీక్షలు: జనవరి 21–30 మధ్య
  • ఫలితాలు: ఫిబ్రవరి 12న
  • చివరి విడత దరఖాస్తులు: జనవరి చివరి వారం నుంచి
  • చివరి విడత పరీక్షలు: ఏప్రిల్‌ 2–9 మధ్య
  • తుది ఫలితాలు: ఏప్రిల్‌ 20న

ప్రధాన వివరాలు:

  • పరీక్షలు తెలుగు, ఇంగ్లిష్‌తో సహా 13 భాషల్లో నిర్వహించబడతాయి.
  • రోజుకు రెండు షిఫ్టులు — ఉదయం 9 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుండి 6 గంటల వరకు.
  • పేపర్‌ 1: 300 మార్కులు (B.Tech)
  • పేపర్‌ 2: 400 మార్కులు (B.Arch/B.Planning)

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana