
DNews:06 NOV:హైదరాబాద్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) నిర్వహించే కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ (CHSL 2025) టైర్–1 ఆన్‌లైన్ రాతపరీక్షకు సంబంధించిన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు విడుదలయ్యాయి. అభ్యర్థులు ఎస్సెస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో తమ వివరాలతో లాగిన్ అయి పరీక్ష నగరం, తేదీ, షిఫ్ట్ వివరాలు తెలుసుకోవచ్చు.
🔹 అడ్మిట్ కార్డులు పరీక్ష తేదీకి 4 రోజుల ముందు విడుదల కానున్నాయి.
🔹 టైర్–1 పరీక్షలు నవంబర్ 12 నుంచి ప్రారంభం కానున్నాయి.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3,131 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో —
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC)
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)
- డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO)
- డేటా ఎంట్రీ ఆపరేటర్ (గ్రేడ్-A) పోస్టులు ఉన్నాయి.
ఇంటర్మీడియట్ అర్హత కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు.
ఇటీవల కమిషన్ పరీక్షార్థుల సౌకర్యార్థం సెల్ఫ్ స్లాట్ ఎంపిక సదుపాయం అందుబాటులోకి తెచ్చింది. అభ్యర్థులు అక్టోబర్ 22 నుంచి 28 వరకు తమకు అనుకూలంగా పరీక్ష నగరం, తేదీ, షిఫ్ట్ ఎంపిక చేసుకునే అవకాశం పొందారు.
తాజాగా విడుదలైన సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లలో ఎంచుకున్న నగరం రాకపోతే, అభ్యర్థులు నవంబర్ 8 లోగా రిప్రెజెంటేషన్ ఇవ్వవచ్చని కమిషన్ తెలిపింది.అలాగే సొంత స్క్రైబ్ సదుపాయం కావాలనుకునే వారు ఎస్సెస్సీ వెబ్‌సైట్‌లో కొత్తగా స్క్రైబ్ రిజిస్ట్రేషన్ చేసి, ఆధార్ ధృవీకరణ చేయాల్సి ఉంటుందని సూచించింది.
👉ఇతర వివరాలు కోసం అభ్యర్థులు ఎస్సెస్సీ అధికారిక వెబ్‌సైట్ https://ssc.gov.in లో చూడవచ్చు.
