DET:NOV 06:
కమల్ హాసన్‌కు అపురూప కానుక:నాయకుడు రీ-రిలీజ్:
నటనకు నిలువెత్తు రూపం,విశ్వనాయకుడు కమల్ హాసన్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్‌లోని మైలురాయి చిత్రం ‘నాయకుడు’ను థియేటర్లలో మళ్లీ విడుదల చేస్తున్నారు.ఈ క్లాసిక్ సినిమాను 4K ఫార్మాట్‌లో చూడటానికి అభిమానులు ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.ఈ రీ-రిలీజ్ వేడుకను మరింత హృదయాన్ని హత్తుకునేలా చేసింది చెన్నైలోని ఓ థియేటర్ యాజమాన్యం.

దివంగత నటుడు రోబో శంకర్‌కు మొదటి టికెట్:
చెన్నైలోని కమలా సినిమాస్ యజమాని విష్ణు తన ఎక్స్ ట్విట్టర్ పేజీలో ఓ భావోద్వేగ పోస్ట్‌ను పంచుకున్నారు.కమల్ సార్ సినిమాల వేడుకలు రోబో శంకర్ మామ లేకుండా గతంలో ఉన్నట్లు ఉండవు అని ఆయన పేర్కొన్నారు.అందుకే,సాధారణ ప్రేక్షకుల బుకింగ్స్ తెరవడానికి ముందే,నాయకుడు సినిమాకు సంబంధించిన మొదటి టికెట్‌ను దివంగత నటుడు రోబో శంకర్ జ్ఞాపకార్థం రిజర్వ్ చేస్తున్నామని ప్రకటించారు.ఆ తర్వాత కొన్ని టికెట్లను ఆయన కుటుంబ సభ్యులకు కేటాయించనున్నట్లు తెలిపారు.

అభిమానమే అసలైన బంధం: కమల్ అంటే రోబో శంకర్‌కు పంచప్రాణాలు:
ఈ మానవీయ చర్యకు కమల్ హాసన్ అభిమానులు మరియు సినీ ప్రేమికుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రోబో శంకర్,కమల్ హాసన్‌కు వీరాభిమాని.తన ఇంటర్వ్యూలలోనూ,టీవీ షోలలోనూ ఆయన కమల్ పట్ల తనకున్న అభిమానాన్ని అనేకసార్లు పంచుకున్నారు.డ్యాన్స్ షోలలో కమల్ పాటలకు ప్రదర్శనలు ఇవ్వడం, కమల్ సినిమాల వేడుకల్లో పాల్గొనడం ఆయనకు ఎంతో ఇష్టం.అందుకే,ఈ రీ-రిలీజ్ వేడుకలో థియేటర్ యాజమాన్యం తీసుకున్న ఈ నిర్ణయం.. రోబో శంకర్‌కు దక్కిన ఒక ఆత్మీయ నివాళిగా అందరూ కొనియాడుతున్నారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana