DET:NOV 06:
చికిరి పాట పుట్టుక: రెహమాన్-బుచ్చిబాబు ముచ్చట్లు:
ఇటీవల పెద్ది సినిమా నుంచి విడుదలైన చికిరి చికిరి పాట ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తిని పెంచింది.అసలు ఈ చికిరి అంటే ఏంటి? అనే సందేహాన్ని నివృత్తి చేస్తూ,దర్శకుడు బుచ్చిబాబు సానా,సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ ల మధ్య జరిగిన ఒక సరదా సంభాషణను వీడియో రూపంలో చిత్రబృందం విడుదల చేసింది.ఈ వీడియోలో పాట వెనుక ఉన్న భావాన్ని ఇద్దరూ వివరించారు.

బుచ్చిబాబుకు రెహమాన్ సంగీతం పరిచయం
:
ఈ ఫన్ వీడియోలో బుచ్చిబాబు సానా,రెహమాన్ గారిపై తనకున్న అభిమానాన్ని పంచుకున్నారు.తాను ఏడో తరగతిలో ఉన్నప్పుడు తన అన్నయ్య ద్వారా రెహమాన్ గారి బాంబే వంటి పాటలు విని,వాటికి ఫిదా అయిపోయానని చెప్పారు.ఇప్పుడు ఆయనతో కలిసి పెద్ది సినిమాకు పనిచేయడం ఒక గొప్ప అనుభూతి అని తెలిపారు.రెహమాన్ గారు కూడా,చాలా కాలం తర్వాత ఒక తెలుగు సినిమాకు సంగీతం అందిస్తున్నానని,బుచ్చిబాబు కథలోని నిజాయితీ,సరళత తనను బాగా ఆకట్టుకున్నాయని అన్నారు.

చికిరి అర్థం: సహజ సౌందర్యానికి ప్రతీక:

పాట యొక్క సందర్భాన్ని వివరిస్తూ,బుచ్చిబాబు గారు చెప్పిన విషయం ఏమిటంటే:హీరో రామ్ చరణ్ ఊరిలో హీరోయిన్‌ను మొదటిసారి చూస్తాడు.అప్పుడు తన స్నేహితుడితో,ఆ కళ్ళకు కాటుక అవసరం లేదు,ఆ ముక్కుకు ముక్కుపుడక అవసరం లేదు… ఏ అలంకరణ లేకుండానే సహజంగా అందంగా ఉండే అరుదైన అమ్మాయి అని చెప్తాడు.ఆ సందర్భంలోనే ఆయన ఆ అమ్మాయిని చికిరి అని పిలుస్తాడు.

ఊరి పడుచులకు ముద్దుపేరు చికిరి:

చికిరి అనే పదం యొక్క లోతైన అర్థాన్ని కూడా బుచ్చిబాబు గారు వివరించారు.ఆ హీరో ఉండే ఊరిలో,అక్కడి అందమైన అమ్మాయిలను అక్కడ మగవారు ప్రేమగా,ఆప్యాయంగా పిలుచుకునే ముద్దుపేరే చికిరి అని.ఈ పదం ఆ పాటలోని మూలాంశం అయ్యింది.ఈ పదం రెహమాన్ గారికి బాగా నచ్చి,దాని చుట్టూ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారట.ఈ పాటలో మోహిత్ చౌహాన్ గానం అందించారు.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana