DSports 30 Oct: ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ బ్యాడ్మింటన్‌లో అతిపెద్ద సంచలనం నమోదైంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో కోర్టు పక్కన ఉండి తన మొబైల్‌లో బెట్టింగ్‌కు పాల్పడిన డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ కోచ్ జోయాకిమ్ పర్సన్ పై బ్యాడ్మింటన్ ప్రపంచ సమాఖ్య (BWF) కఠిన చర్య తీసుకుంది. అతడిపై నాలుగేళ్ల పాటు అన్ని బ్యాడ్మింటన్ కార్యకలాపాల నుండి నిషేధం విధిస్తూ BWF ప్రకటించింది.
రెండుసార్లు ఒలింపిక్ క్వార్టర్ ఫైనలిస్ట్ అయిన స్టార్ ప్లేయర్ ఆండర్స్ ఆంటోన్సన్కు కోచ్‌గా పనిచేసిన పర్సన్, గత ఏడాది జపాన్ ఓపెన్ సందర్భంగా మ్యాచ్ జరుగుతుండగానే బెట్టింగ్ పెట్టాడు. ఈ టోర్నమెంట్ పారిస్ ఒలింపిక్స్ ముగిసిన రెండు వారాల తర్వాత జరిగింది.

సాక్ష్యం దొరికిందిలా:

.కోర్టు పక్కనే ఉన్న మరో ఆటగాడు పర్సన్ బెట్టింగ్ పెడుతున్న దృశ్యాలను వీడియో తీసి, BWFకు సాక్ష్యంగా సమర్పించాడు.

.విచారణ పత్రాల ప్రకారం, అతడు తన ఆన్‌లైన్ జూదం ఖాతా ద్వారా ఆ మ్యాచ్‌పై ఏకంగా తొమ్మిది బెట్‌లు పెట్టినట్లు తేలింది.

.ఈ సంఘటన బయటపడగానే ఆంటోన్సన్ అతడిని కోచ్ పదవి నుంచి తొలగించారు.

జోయాకిమ్ పర్సన్ గతంలో యూరోపియన్ ఛాంపియన్‌షిప్‌లో సింగిల్స్ రజత పతకం (2008) సాధించిన ప్రముఖ ఆటగాడు కూడా.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana