**₹300 Crore Theatrical Run.. Crazy OTT Update on ‘Bethlehem Kudumba Unit’!**

D News: ఎలాంటి భారీ అంచనాలు లేకుండా విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న మలయాళ చిత్రం ‘బెత్లెహొమ్ కుటుంబ యూనిట్’ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. నివిన్ పౌలి, మమితా బైజు జంటగా నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సుమారు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించినట్లు సమాచారం.

ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి

ఇటీవల తెలుగు రాష్ట్రాల్లోనూ విడుదలైన ఈ సినిమాకు మంచి స్పందన లభిస్తోంది. ఇదిలా ఉంటే, మూవీ డిజిటల్ హక్కులను జియో హాట్‌స్టార్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. థియేట్రికల్ రిలీజ్‌ తర్వాత 4 నుంచి 6 వారాల వ్యవధిలో ఓటీటీలోకి తీసుకురావాలని ఒప్పందం కుదిరినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ లెక్కన సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారంలో సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చే అవకాశం ఉందని సమాచారం. మలయాళంతో పాటు తెలుగు వెర్షన్ కూడా ఒకేసారి అందుబాటులోకి రావచ్చని టాక్ వినిపిస్తోంది. అయితే ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కీలక పాత్రల్లో పలువురు నటులు

‘బెత్లెహొమ్ కుటుంబ యూనిట్’లో నివిన్ పౌలి, మమితా బైజుతో పాటు సంగీత్ ప్రతాప్, సురేశ్ కృష్ణ, వినయ్ ఫోర్ట్, రోషన్ షానవాస్ తదితరులు నటించారు. దిలీష్ పోతన్, ఫహాద్ ఫాజిల్, శ్యామ్ పుష్కరన్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేసింది.

By Avinash