D News: Aug 22: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 2,482 లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు.. ఏపీకి 80, తెలంగాణకు 50

బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) శుభవార్త అందించింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని బ్యాంకు శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన లోకల్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,482 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు 80 పోస్టులు, తెలంగాణకు 50 పోస్టులు కేటాయించారు. అర్హత కలిగిన అభ్యర్థులు 2026 సెప్టెంబర్ 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత

LBO పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా విద్యాసంస్థ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. దీంతో పాటు షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులో కనీసం ఒక సంవత్సరం పోస్ట్-క్వాలిఫికేషన్ అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్థులు తాము దరఖాస్తు చేస్తున్న రాష్ట్రానికి సంబంధించిన స్థానిక భాషను చదవడం, రాయడం, మాట్లాడటం, అర్థం చేసుకోవడం తెలిసి ఉండాలి.

వయోపరిమితి

అభ్యర్థుల వయస్సు 2026 ఆగస్టు 1 నాటికి 21 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు చెందిన అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు గరిష్ఠంగా 15 సంవత్సరాల వరకు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు ఫీజు

అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 7, 2026 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం, మహిళా అభ్యర్థులకు రూ.175 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు.

ఎంపిక విధానం

అభ్యర్థుల ఎంపికను పలు దశల్లో నిర్వహిస్తారు. ముందుగా ఆన్‌లైన్ రాత పరీక్ష ఉంటుంది. ఆ తర్వాత సైకోమెట్రిక్ టెస్ట్, భాషా నైపుణ్య పరీక్షతో పాటు గ్రూప్ డిస్కషన్ (GD)/ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.

జీతభత్యాలు

ఎంపికైన అభ్యర్థులకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు బేసిక్ పే లభిస్తుంది. దీనికి అదనంగా బ్యాంకు నిబంధనల ప్రకారం వివిధ అలవెన్సులు, ఇతర ప్రయోజనాలు అందుతాయి.

ఆన్‌లైన్ రాత పరీక్ష విధానం

ఆన్‌లైన్ పరీక్షలో మొత్తం 120 మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఉంటాయి. వీటికి 120 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.

  • ఇంగ్లిష్: 30 ప్రశ్నలు – 30 మార్కులు
  • బ్యాంకింగ్ నాలెడ్జ్: 30 ప్రశ్నలు – 30 మార్కులు
  • జనరల్/ఎకానామిక్ అవేర్‌నెస్: 30 ప్రశ్నలు – 30 మార్కులు
  • రీజనింగ్ & క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: 30 ప్రశ్నలు – 30 మార్కులు

పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కు కోత విధిస్తారు.

అభ్యర్థులు దరఖాస్తు చేసే ముందు విద్యార్హతలు, వయోపరిమితి, స్థానిక భాష, అనుభవం, ఎంపిక విధానం తదితర వివరాలను అధికారిక నోటిఫికేషన్‌లో పూర్తిగా పరిశీలించిన తర్వాతే దరఖాస్తు చేసుకోవడం మంచిది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana