
D Spiritual: Oct 1: తిరుమల: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా కొనసాగుతోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో యాత్రికులు తిరుమలకు తరలివస్తుండటంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని కంపార్టుమెంట్లన్నీ భక్తులతో నిండిపోయాయి.
సర్వదర్శనానికి 24 గంటల సమయం: ప్రత్యేక ప్రవేశ దర్శన టోకెన్లు లేని సాధారణ భక్తులకు సర్వదర్శనం కల్పించేందుకు సుమారు 24 గంటల సమయం పడుతోంది. క్యూ లైన్లలో రద్దీ అధికంగా ఉండటంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా టీటీడీ అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.63 కోట్లు: శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో బారులు తీరుతున్నారు. నిన్న ఒక్కరోజే మొత్తం 78,723 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వీరిలో 37,664 మంది తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇదే సమయంలో శ్రీవారి హుండీ ద్వారా రూ.4.63 కోట్ల ఆదాయం సమకూరినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.
