D News: Jul 22: Assam Floods: అసోంలో తీవ్ర వరదలు.. మృతుల సంఖ్య 31కు చేరిక

ఈశాన్య రాష్ట్రమైన అసోంలో వరద పరిస్థితి రోజురోజుకూ మరింత విషమంగా మారుతోంది. ఎగువ ప్రాంతాల్లో సంభవించిన క్లౌడ్‌బర్స్ట్‌ (అతిభారీ వర్షాలు) కారణంగా భారీ వరదలు సంభవించాయి. మంగళవారం ఒక్కరోజే మరో 21 మంది ప్రాణాలు కోల్పోవడంతో, ఈ ఏడాది వరదల కారణంగా మరణించిన వారి సంఖ్య 31కు చేరింది. అసోం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (ASDMA) తెలిపిన వివరాల ప్రకారం, రాష్ట్రంలోని 16 జిల్లాల్లో 5.64 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత 24 గంటల్లో నమోదైన మరణాల్లో శివసాగర్ జిల్లాలో 13 మంది, చరైదేవ్‌లో 5 మంది, గోలాఘాట్‌లో 2 మంది, జోర్హాట్‌లో ఒకరు మృతి చెందారు. ప్రస్తుతం 44 రెవెన్యూ సర్కిళ్ల పరిధిలోని 872 గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. ఒక్క శివసాగర్ జిల్లాలోనే 3,59,535 మంది, జోర్హాట్‌లో 87,662 మంది, చరైదేవ్‌లో 72,646 మంది వరదలతో తీవ్రంగా ప్రభావితమయ్యారు.

వరద బాధితుల కోసం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 71 సహాయ శిబిరాలు ఏర్పాటు చేసింది. ప్రస్తుతం 12,284 మంది బాధితులు ఈ శిబిరాల్లో ఆశ్రయం పొందుతున్నారు. అవసరమైన ఆహారం, తాగునీరు, వైద్య సేవలు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు.

రంగంలోకి వాయుసేన, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు

వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం అయ్యాయి. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ (IAF), నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF), SDRF, ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సర్వీసెస్ సిబ్బంది బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ చరైదేవ్, నజీరా, శివసాగర్, సోనారీ, జోర్హాట్, టియోక్ ప్రాంతాల్లో ప్రత్యక్షంగా పర్యటించి సహాయక చర్యలను సమీక్షించనున్నారు.

రైలు సేవలకు అంతరాయం.. టెలికాం శాఖ ప్రత్యేక చర్యలు

సిమలుగురి పరిసర ప్రాంతాల్లో రైల్వే ట్రాక్‌లపై వరద నీరు చేరడంతో వరుసగా రెండో రోజు కూడా రైలు రాకపోకలు నిలిచిపోయాయి. ఈశాన్య సరిహద్దు రైల్వే (NFR) పలు రైళ్లను రద్దు చేయగా, చిక్కుకున్న ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది.

ఇక కమ్యూనికేషన్ వ్యవస్థకు అంతరాయం కలగకుండా ఉండేందుకు టెలికాం శాఖ (DoT) శివసాగర్, చరైదేవ్, జోర్హాట్ జిల్లాల్లో జూలై 24 వరకు ICR (Intra Circle Roaming) సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఒక టెలికాం సంస్థ నెట్‌వర్క్ పనిచేయకపోయినా, ఇతర నెట్‌వర్క్‌ల ద్వారా కాల్స్, సందేశాలు వంటి సేవలను వినియోగించుకునే అవకాశం ప్రజలకు లభించనుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana