
DET:FEB 25:
సైజు కురుప్ సినీ ప్రస్థానానికి 20 ఏళ్లు:
మలయాళ వెండితెరపై విలక్షణమైన నటనతో మెప్పించే నటుడు సైజు కురుప్.ఆయన చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి అప్పుడే రెండు దశాబ్దాలు గడిచిపోయాయి.2005లో మయూఖం అనే సినిమాతో కెరీర్ ప్రారంభించిన సైజు నేడు మాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న నటులలో ఒకరిగా ఎదిగారు.సహాయ నటుడిగా,విలన్‌గా అలాగే కామెడీ పాత్రల్లో ఆయన చూపించిన వైవిధ్యం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఆరామ్ సెట్స్‌లో ఘనంగా వేడుకలు:
ప్రస్తుతం సైజు కురుప్ తన కొత్త సినిమా ఆరామ్ షూటింగ్లో బిజీగా ఉన్నారు.ఈ సినిమా సెట్స్‌లోనే ఆయన తన 20 ఏళ్ల మైలురాయిని చిత్ర యూనిట్ సమక్షంలో జరుపుకున్నారు.ఈ వేడుకలో సినిమా బృందం పెద్ద కేక్ కట్ చేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.షూటింగ్ సెట్లో పండుగ వాతావరణం నెలకొంది.తన సుదీర్ఘ ప్రయాణంలో తోడుగా ఉన్న దర్శకులు,నిర్మాతలు మరియు తోటి నటులకు సైజు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
సోషల్ మీడియాలో అభిమానుల సందడి:
ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని సైజు కురుప్ తన సోషల్ మీడియా వేదికగా భావోద్వేగపూరితమైన పోస్ట్‌ను షేర్ చేశారు. మయూఖం సినిమాతో మొదలైన ఈ ప్రయాణం ఇక్కడి వరకు వస్తుందని అనుకోలేదు.ప్రేక్షకులు చూపించిన ప్రేమే నన్ను ఈ స్థాయికి చేర్చింది అని ఆయన పేర్కొన్నారు.దీనితో అభిమానులు మరియు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటూ విషెస్ చెబుతున్నారు.
వైవిధ్యమైన పాత్రలే ఆయన బలం:
సైజు కురుప్ కేవలం ఒకే రకమైన పాత్రలకు పరిమితం కాకుండా విభిన్నమైన జోనర్లను టచ్ చేశారు.ముఖ్యంగా ఆడు చిత్రంలోని అరక్కల్ అబు పాత్ర ఆయనకు విపరీతమైన క్రేజ్ తెచ్చిపెట్టింది.అలాగే డ్రైవింగ్ లైసెన్స్,ప్రతీ విలన్ పక్కన ఒక ఫ్రెండ్ లాంటి పాత్రల్లో ఆయన టైమింగ్ అద్భుతంగా ఉంటుంది.ప్రస్తుతం ఆయన చేతిలో ఆరామ్ తో పాటు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.
