
తూర్పు గోదావరి జిల్లా లో భారీగా గంజాయి పట్టుబడింది. తల్లపూడి మండలం మలకపల్లి వద్ద, విశాఖపట్నం పోలీసులు ₹1.5 కోట్ల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విశాఖపట్నం నుంచి కారును పోలీసులు వెంబడించారు. చివరకు, మలకపల్లి వద్ద స్మగ్లర్ పట్టుబడ్డాడు. మరొక నిందితుడు తప్పించుకున్నాడు.
దాదాపు 600 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకోగా, పట్టుబడిన నిందితుడిని తల్లపూడి పోలీస్ స్టేషన్కు తరలించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు ప్రారంభించారు.
