DNews:31 OCT:సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఉద్యోగులు, ఆఫీసర్లు నివసించేందుకు వీలుగా 1000 కొత్త క్వార్టర్లను నిర్మించడానికి యాజమాన్యం నిర్ణయం తీసుకుని, రూ. 450 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్వార్టర్ల నిర్మాణాన్ని రూ. 313.32 కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభించనున్నారు. ఈ నిర్మాణాలు జీ+1 విధానంలో చేపట్టనున్నారు. ఆఫీసర్ల కోసం మిలీనియం ఏ, బీ పద్ధతిలో డబుల్, త్రిబుల్ బెడ్‌రూమ్ తరహా ఇళ్లను, అలాగే సూపర్​వైజర్ క్యాడర్, వర్క్‌మెన్ల కోసం మిలీనియం సీ, డీ బ్లాక్ పద్ధతిలో క్వార్టర్లను నిర్మిస్తారు. ప్రతి బ్లాక్‌లో నివసించే వారి కోసం గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్ సౌకర్యం కల్పించబడుతుంది. ఈ ప్రాజెక్ట్‌కు జూన్‌లో డైరెక్టర్ల బోర్డు ఆమోదం తెలపగా, తాజాగా ఫండ్స్ మంజూరయ్యాయి. మొత్తం 1000 క్వార్టర్లలో, ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగుల కోసం 860 క్వార్టర్లు, ఆఫీసర్ల కోసం 140 క్వార్టర్లు నిర్మిస్తారు.

ఈ కొత్త క్వార్టర్ల నిర్మాణం వివిధ ఏరియాలలో ఇలా చేపట్టనున్నారు:

  • మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా: రూ. 193 కోట్లతో 449 క్వార్టర్లు
  • పెద్దపల్లి జిల్లా రామగుండం-1 ఏరియా (గోదావరిఖని): రూ. 133 కోట్లతో 318 క్వార్టర్లు
  • భూపాలపల్లి జిల్లా కేంద్రం: రూ. 45 కోట్లతో 79 క్వార్టర్లు
  • ఖమ్మం జిల్లా మణుగూరు ఏరియా: రూ. 79 కోట్లతో 154 క్వార్టర్లు

కొత్తగా క్వార్టర్లు నిర్మించే ప్రతిపాదిత స్థలాల లేఅవుట్లను ఏర్పాటు చేయాలని సంబంధిత ఆఫీసర్లను సింగరేణి కార్పొరేట్ యాజమాన్యం ఆదేశించింది.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana