DNews:22 Dec: హైదరాబాద్ నగరంలోని రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2025 సంవత్సరంలో నేరాల సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై సోమవారం సీపీ సుధీర్ బాబు వార్షిక నేరాల నివేదికను విడుదల చేశారు.నివేదిక ప్రకారం, 2024లో రాచకొండ పరిధిలో 28,626 కేసులు నమోదైనప్పటికీ, 2025లో ఈ సంఖ్య 33,040కి పెరిగింది. నగదు, నగల కోసం హత్యలు 2024లో ఐదుగా నమోదు కాగా, 2025లో మూడు మాత్రమే నమోదయ్యాయి.ఇక ముఖ్యంగా 2025లో జరిగిన ఇతర నేరాల వివరాలు, కిడ్నాప్ కేసులు 579, POCSO (పిల్లలపై లైంగిక దాడి) కేసులు 1,224, హత్యలు 73, అత్యాచారాలు 330 మహిళలపై నేరాల సంఖ్యలో గత ఏడాది కంటే 4 శాతం పెరుగుదల గమనించబడింది. 2025లో రూ.20 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకోగా, డ్రగ్స్ కేసుల్లో 668 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ఇదిలా ఉండగా గతేడాది పోలిస్తే చోరీలు, దోపిడీలు తగ్గినట్లు నివేదిక చెబుతోంది. 2024లో 118 రాబరీ కేసులు నమోదయ్యాయి, కాని 2025లో ఇవి 67కి తగ్గాయి.ఇళ్లలో తాళం పగులగొట్టి చోరీలు 589, వాహన దొంగతనాలు 876ఇతర చోరీలు 1,161, వరకట్న వేధింపుల కారణంగా 2024లో 18 మంది మరణించగా, 2025లో ఈ సంఖ్య 12కి తగ్గింది. గృహ హింస కేసులు కూడా గణనీయంగా తగ్గి, 1,222 నుంచి 782కి పడిపోయాయి.సీపీ సుధీర్ బాబు ఈ నివేదిక ద్వారా రాచకొండ కమిషనరేట్ పోలీస్ శాఖ కఠిన ప్రయత్నాలతో మరింత ప్రజాసేవపై దృష్టి పెట్టినట్లు తెలిపారు. ప్రజల సహకారం, అప్రమత్తతతోనే నేరాలను కట్టడించగలుగుతామని చెప్పారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana