DSports:18 OCT:హైదరాబాద్‌ : యూత్‌ ఆసియా గేమ్స్‌లో పాల్గొనబోయే భారత పురుషుల కబడ్డీ జట్టుకు తెలంగాణకు చెందిన లింగంపల్లి శ్రీనివాస్‌ రెడ్డి కోచ్‌గా ఎంపికయ్యారు. ఈ నెల 19 నుంచి 23 వరకు బహ్రెయిన్‌లో జరగనున్న గేమ్స్‌లో టీమ్‌ ఇండియా బరిలోకి దిగనుంది.

శ్రీనివాస్‌ రెడ్డి కోచ్‌గా ఎంపిక కావడంపై తెలంగాణ కబడ్డీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కాసాని వీరేష్‌, జనరల్‌ సెక్రటరీ ఎం. మహేందర్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. “తెలంగాణకు చెందిన కోచ్‌ ఈ స్థాయిలో ఎంపిక కావడం గర్వకారణం. ఆయన మార్గదర్శకత్వంలో భారత జట్టు గోల్డ్‌ మెడల్‌ సాధిస్తుందని విశ్వసిస్తున్నాం,” అని వారు పేర్కొన్నారు.

సంగారెడ్డి జిల్లా ఉత్తర్పల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్‌ రెడ్డికి కబడ్డీ కోచింగ్‌లో విస్తృత అనుభవం ఉంది. ఆయన గతంలో దుబాయ్‌ మాస్టర్స్‌ టోర్నీలో భారత జట్టుకు కోచ్‌గా, అలాగే జూనియర్‌ టీమ్‌కు ఆసియా చాంపియన్‌షిప్‌లో, సీనియర్‌ విమెన్స్‌ జట్టుకు ఆసియా గేమ్స్‌–2018లో కోచ్‌గా సేవలందించారు.

అంతర్జాతీయ స్థాయిలోనే కాకుండా దేశీయ లీగ్‌ల్లో కూడా ఆయన విశేష అనుభవం సంతరించుకున్నారు. ప్రో కబడ్డీ లీగ్‌లో హర్యానా స్టీలర్స్‌, జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌, తెలుగు టైటాన్స్‌ ఫ్రాంచైజీలకు కోచ్‌గా పని చేశారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana