Dnews 25: భారతదేశంలో అమ్ముడయ్యే ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కలర్-కోడెడ్ హెచ్చరిక లేబుళ్ల విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వెనక్కు తగ్గిందని పేర్కొంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘రాయిటర్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. భారతదేశంలో అమ్ముడయ్యే ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై కలర్-కోడెడ్ హెచ్చరిక లేబుళ్ల విషయంలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) వెనక్కు తగ్గిందని పేర్కొంటూ అంతర్జాతీయ మీడియా సంస్థ ‘రాయిటర్స్’ సంచలన కథనాన్ని ప్రచురించింది. ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై హెచ్చరిక లేబుళ్ల విషయంలో.. దిగ్గజ కంపెనీల ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత, కార్పొరేట్ లాబీయింగ్ ఒత్తిడి కారణంగానే ఎఫ్ఎస్ఎస్ఏఐ పూర్తిగా వెనక్కి తగ్గిందని, కలర్‌ఫుల్ లేబుల్స్ విధానాన్ని పక్కన పెట్టేసిందని రాయిటర్స్ తన కథనంలో పేర్కొంది.ఫుడ్ కంపెనీల ద్వంద్వ వైఖరీ..

దిగ్గజ ఫుడ్ కంపెనీలు బ్రిటన్, యూరప్ దేశాలలో ఫుడ్ ప్యాకెట్ల ముందు భాగంలో కలర్-కోడెడ్ హెచ్చరిక లేబుళ్లను స్వచ్ఛందంగా ఇస్తున్నాయని, అదే నిబంధనలను భారతదేశంలో అమలు చేయాలని చూస్తే అడ్డుకుంటున్నాయని రాయిటర్స్ పేర్కొంది. పరిశ్రమ అంచనాల ప్రకారం.. ఇండియా ప్యాకేజ్డ్ ఫుడ్ మార్కెట్‌లో దాదాపు 80 శాతం ఉత్పత్తులలో చక్కెర, ఉప్పు, కొవ్వులు చాలా ఎక్కువగా ఉంటాయని.. ఈ రూల్ తెస్తే దాదాపు అన్ని ప్యాకెట్లు ఎరుపు రంగుతో నిండిపోయి తమ వ్యాపారం పూర్తిగా దెబ్బతింటుందని కంపెనీలు ఆందోళన చెందుతున్నాయని తెలిపింది. విదేశాల్లో వినియోగదారులకు ఆరోగ్య సంబంధిత లేబుళ్లను అందిస్తున్న కొన్ని కంపెనీలు.. భారత్‌లో మాత్రం ఇలాంటి నిబంధనలను వ్యతిరేకిస్తున్నాయని రాయిటర్స్ కథనం పేర్కొంది.

By CS.H

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana