కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించు కోవడానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు.. దేశ విదేశాలతోపాటు.. ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారు. అయితే.. శబరి మలను ప్రపంచ పుణ్యక్షేత్రంగా మార్చే లక్ష్యంతో సెప్టెంబర్ 20న పంపాలో అయ్యప్ప సంగమం పెద్ద ఎత్తున జరగనుంది..

కేరళ శబరిమల కొండలపై వెలిసిన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఏటా లక్షల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.. దేశవిదేశాలతోపాటు.. ఏపీ, తెలంగాణ ప్రాంతాల నుంచి కూడా భక్తులు అయ్యప్పస్వామిని దర్శించుకుంటారు. అయితే.. శబరిమలను ప్రపంచ పుణ్యక్షేత్రంగా మార్చే లక్ష్యంతో సెప్టెంబర్ 20న పంపాలో అగోల అయ్యప్ప సంగమం (Agola Ayyappa Sangamam) పెద్ద ఎత్తున జరగనుంది.. ఈ సంగమానికి అయ్యప్ప భక్తులందరూ హాజరుకావాలని ఈ మేరకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు కీలక ప్రకటనచేసింది. ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు ప్లాటినం జూబ్లీ లో భాగంగా, శబరిమలని ప్రపంచవ్యాప్తంగా దైవిక, సాంప్రదాయ – స్థిరమైన తీర్థయాత్ర కేంద్రంగా ఉన్నతీకరించే లక్ష్యంతో గ్లోబల్ అయ్యప్ప సంగమం సెప్టెంబర్ 20న పంపా నది ఒడ్డున జరుగనుంది.

ప్రపంచం నలుమూలల నుండి వచ్చే అయ్యప్ప భక్తులు శబరిమల ఆధ్యాత్మిక వైభవాన్ని, సాంస్కృతిక ఐక్యతను పంచుకోవడానికి ఈ సంగమం ఒక వేదిక కానుంది.. “తత్వమసి” అనే సార్వత్రిక సందేశాన్ని వ్యాప్తి చేయడం, శబరిమలని మత సామరస్యాన్ని పంచుకునే ప్రపంచ తీర్థయాత్ర కేంద్రంగా మార్చడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం.

గ్లోబల్అయ్యప్ప సంగమం – భక్తులకు విస్తృత ఏర్పాట్లు 🙏

  • పంపాలో 3,000 మందికి వసతి కల్పించే జర్మన్ మోడల్ పండల్
  • పతనంతిట్ట, పెరునాడ్, సీతాతోడ్ ప్రాంతాల్లో స్వాగత కార్యాలయాలు
  • KSRTC రవాణా, దర్శనఏర్పాట్లు, ఆసుపత్రుల్లో ఆధునిక వైద్య సేవలు
  • కొండలపై పార్కింగ్, పారిశుధ్య సదుపాయాలు, స్వచ్ఛంద సంస్థల సహకారం

🔧భవిష్యత్అభివృద్ధి ప్రణాళిక

  • రూ.1,300 కోట్లు అంచనా వ్యయంతో విమానాశ్రయం, రైల్వేలైన్ ప్రాజెక్టులు
  • “తత్వమసి” లోగో విడుదల – అయ్యప్ప తత్వాన్ని సూచిస్తూ

🤝భక్తులకు – అధికారులకు వేదిక

  • భక్తుల అభిప్రాయాల కోసం చర్చావేదిక
  • తంత్రి, దేవస్వం బోర్డు అధికారుల సమక్షంలో అభిప్రాయ మార్పిడి

🌍శబరిమల గ్లోబల్లక్ష్యం

  • ఆధ్యాత్మికత + పర్యావరణ పరిరక్షణ కలగలిపిన నూతనదర్శనమార్గం
  • శబరిమల‌ను ప్రపంచస్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం

స్వామియేశరణంఅయ్యప్ప! 🔱

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana
పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana