D ET: OCt 26 : ఏ పేరెంట్స్ అయినా పిల్లలకు పెళ్లి చేయాలని చూస్తారు. కానీ ఈ తల్లి మాత్రం అందుకు భిన్నం.. తన కూతుళ్లు పెళ్లి చేసుకోకుండా ఉంటే ఏకంగా రూ. 29 లక్షలు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. అసలు పెళ్లిళ్లపై ఈ తల్లికి ఎందుకంత కోపం..? తన సొంత జీవితంలో జరిగిన ఒక సంఘటన దీనికి కారణమా..? ఆమె ఆలోచన వెనుక ఉన్న ఆ రహస్యం ఏమిటి? అనేది తెలుసుకుందాం..
సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలకు మంచిగా పెళ్లి చేసి బాధ్యత తీర్చుకోవాలని అనుకుంటారు. కానీ విదేశాలకు చెందిన ఒక తల్లి మాత్రం దీనికి భిన్నంగా ఆలోచించి, అందరి దృష్టిని ఆకర్షించింది. తన కూతుళ్లు పెళ్లి చేసుకోకపోతే పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని ఆఫర్ ఇచ్చింది. కేట్ అనే నలుగురుపిల్లల తల్లి తన కూతుళ్లకు ఒక వింత ఆఫర్ ఇచ్చింది. అదేమిటంటే.. ఎవరైనా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంటే వారికి దాదాపు రూ. 29 లక్షలు ఇస్తానని చెప్పింది. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది.