
DNews:05NOV: పెద్దపల్లి జిల్లాలో రాబోయే మూడు రోజుల పాటు పత్తి కొనుగోలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రైతులకు విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని మార్కెట్ యార్డులు, సీసీఐ కేంద్రాలకు రైతులు పత్తి తీసుకురావొద్దని సూచించారు.
మంగళవారం కలెక్టరేట్‌లో పత్తి కొనుగోలు వ్యవహారంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర జిన్నింగ్ మిల్స్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జిన్నింగ్ మిల్లు యజమానులు, సీసీఐ, ప్రైవేట్ కొనుగోలు సంస్థలు తాత్కాలికంగా కొనుగోలు నిలిపివేస్తున్నారని తెలిపారు.
ఈ నిర్ణయం నేపథ్యంలో రైతులు తమ పత్తిని మార్కెట్ యార్డులకు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సమావేశంలో జిల్లా మార్కెటింగ్ అధికారి ప్రవీణ్ రెడ్డి, కాటన్ మార్కెట్ కమిటీ కార్యదర్శులు, పోలీస్, రవాణా, అగ్నిమాపక శాఖ అధికారులు, సీసీఐ ప్రతినిధులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు పాల్గొన్నారు.
