Dnews 04: నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా, రెస్క్యూ సిబ్బంది త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఇద్దరు వ్యక్తులను ప్రాణాలతో బయటకు తీశారు.నేపాల్‌లో వరదల కారణంగా టన్నెల్స్‌లో చిక్కుకుపోయిన వారికోసం రెస్క్యూ ఆపరేషన్స్ ముమ్మరంగా కొనసాగుతున్నాయి. తాజాగా, రెస్క్యూ సిబ్బంది త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ టన్నెల్ నుంచి ఇద్దరు వ్యక్తులను ప్రాణాలతో బయటకు తీశారు. నేపాల్ ఎలక్ట్రిసిటీ అథారిటీకి చెందిన మెకానిల్ ఫోర్‌మ్యాన్ 30 ఏళ్ల షా, త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ 45 ఏళ్ల అమిర్ మహర్జన్‌లను టన్నెల్స్ నుంచి రక్షించారు. వరదల కారణంగా టన్నెల్స్‌లో బురదలో చిక్కుకుపోయిన ఆ ఇద్దరూ 9 రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డంతో అధికారుల్లో ఆశలు మొదలయ్యాయి.బయటకు వచ్చే సమయానికి ఇద్దరి చేతులు, కాళ్లకు గాయాలు ఉన్నాయని అధికారులు మీడియాకు తెలిపారు. టన్నెల్స్‌లో పాకటం కారణంగా వారికి గాయాలు అయి ఉండొచ్చని అన్నారు. త్రిశూలీ త్రీఏ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ సూపర్‌వైజర్ అమిర్ మహర్జన్ సోదరుడు మీడియాతో మాట్లాడుతూ.. ‘నాకెంతో సంతోషంగా ఉంది. గాల్లో తేలిపోతున్నట్లుగా ఉంది’ అంటూ సంతోషం వ్యక్తం చేశాడు.

By CS.H

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana