DNews:04 NOV: నిజామాబాద్‌ జిల్లాలో మరో మహిళా వేధింపుల ఘటన వెలుగుచూసింది. వినాయక్‌నగర్‌లో ఓ యువతిని వేధింపులకు గురి చేసిన డెంటల్‌ డాక్టర్‌, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిపై పోలీసులు నిర్భయ చట్టం (Nirbhaya Act) కింద కేసు నమోదు చేశారు.బాధితురాలు సోమవారం నిజామాబాద్ పోలీస్‌ కమిషనర్‌ సాయి చైతన్య (CP Sai Chaitanya) ను కలిసి గోడును వెల్లగక్కడంతో ఈ ఘటన బయటపడింది.

2021లో ప్రగతినగర్‌లోని ట్రావెల్స్‌ ఏజెన్సీలో పని చేస్తున్న బాధితురాలికి ఓ డెంటల్‌ డాక్టర్‌ పాస్‌పోర్ట్‌ పనిమీద వచ్చి, ఆమె ఫోన్‌ నంబర్‌ తీసుకున్నాడు.ఆ తరువాత తరచుగా కాల్‌ చేసి అసభ్యంగా మాట్లాడి, డబ్బులు ఆఫర్‌ చేస్తూ వేధింపులకు పాల్పడ్డాడు.అంతేకాకుండా నగరానికి చెందిన ఆయిల్‌ గంగాధర్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి కూడా ఇలాంటి వేధింపులు కొనసాగించినట్లు యువతి ఫిర్యాదులో పేర్కొంది.

2023లో వివాహం చేసుకుని ఉద్యోగం మానేసిన బాధితురాలు, వేధింపులు ఆగకపోవడంతో పోలీస్ కమిషనర్‌ వద్ద ఫిర్యాదు చేసింది.

సీపీ ఆదేశాల మేరకు నాలుగో టౌన్‌ ఎస్సై శ్రీకాంత్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇద్దరు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana