
DNews:08 OCT:హైదరాబాద్ : దీపావళి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లు అప్రమత్తమయ్యాయి. బాణసంచా విక్రయ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునే వారు తప్పనిసరిగా లైసెన్స్ తీసుకోవాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. పేలుడు పదార్థాల చట్టం 1884, పేలుడు నియమాలు 1983 (2008లో సవరించబడినవి) ప్రకారం ప్రతి దుకాణదారుడు అనుమతి పత్రం పొందడం తప్పనిసరి అని తెలిపారు.
లైసెన్స్‌లు ఆయా జోనల్ డిప్యూటీ కమిషనర్లు జారీ చేస్తారని, దరఖాస్తులను అక్టోబర్ 16వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో సమర్పించాలి అని సూచించారు. దీనికోసం మేము వెబ్‌సైట్లను సందర్శించవచ్చని పోలీసులు పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా బాణసంచా విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. పండుగ సందర్భంలో ప్రజల భద్రత దృష్ట్యా ఈ చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు.
