Dnews 17: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా.. అయితే బిగ్ అలర్ట్. దర్శన టికెట్ల జారీని టీటీడీ నిలిపివేసింది. ఆరు రోజుల పాటు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది. శ్రీవారి దర్శనం కోసం ఎస్‌ఎస్‌డీ దర్శన టికెట్లను అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ టికెట్లను 14వ తేదీ నుంచి 19 వరకు నిలిపివేయనున్నారు.

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్. తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఉచిత ఎస్‌ఎస్‌డీ టోకెన్లను తిరుపతిలో జారీ చేస్తారనే విషయం తెలిసిందే. తర్వాతి రోజు దర్శనానికి ముందు రోజు టికెట్లను జారీ చేస్తారు. తిరుపతిలోని విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం కాంప్లెక్స్‌లో వీటిని పంపిణీ చేస్తారు. అయితే తిరుమల సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని రద్దు చేసింది. ఈ నెల 14వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఈ టోకెన్లను జారీ చేయరు. మొత్తం ఆరు రోజుల పాటు జారీని ఆపేయనున్నారు. తిరిగి ఈ నెల 20వ తేదీన టోకెన్ల జారీ తిరిగి ప్రారంభిస్తారు. 21వ తేదీన దర్శనానికి 20న జారీ చేయనున్నారు.పెరగనున్న భక్తుల రద్దీ

ఈ నెల 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలను వీక్షించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఈ నెల 15వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానుండగా.. ఇప్పటికే ఏర్పాట్లు అన్నీ పూర్తి చేశారు. బ్రహ్మోత్సవాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో రద్దీ పెరగనుంది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఎస్ఎస్‌డీ టోకెన్ల జారీని అధికారులు నిలిపివేశారు. అలాగే వీవీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో టికెట్లు అవసరం లేకుండా భక్తులు నేరుగా క్యూలైన్లలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవచ్చు. సోమవారం దర్శనం కోసం ఆదివారం భక్తులు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల కోసం క్యూలైన్లలో నిల్చోగా.. అధికారులు టికెట్లు జారీ చేయడం లేదని ప్రకటించడంతో వెనుతిరిగారు. వినాయక చవితి పండుగ సందర్భంగా వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశముంది. దీంతో సామాన్య భక్తులకు దర్శన అవకాశం కల్పించేందుకు వీవీఐపీ బ్రేక్ దర్శనాలను పది రోజుల పాటు నిలిపివేశారు. ఈ సమయాన్ని సామాన్య భక్తుల కోసం కేటాయించనున్నారు. భక్తులు దీనిని గమనించి సహకరించాలని టీటీడీ కోరింది.దర్శన టోకెన్లు లేకుండా శ్రీవారి దర్శనం ఎలా..?

ఎస్‌ఎస్‌డీ దర్శన టోకెన్లలో టైమ్ ఉంటుంది. ఆ సమయానికి క్యూలైన్లలోకి వెళితే స్వామివారి దర్శనం కల్పిస్తారు. అయితే ఎస్‌ఎస్‌డీ టోకెన్ల జారీని నిలిపివేయడంతో.. భక్తులు నేరుగా తిరుపతిలో ఆగకుండా తిరుమలకు వెళ్లాలి. తిరుమలలో అన్నీ పనులు పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా దర్శన క్యూలైన్లలోకి వెళితే సరిపోతుంది. ఎటువంటి టోకెన్ లేకపోయినా అనుమతిస్తారు. అనంతరం స్వామివారి దర్శనం చేసుకోవచ్చు.

By CS.H

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana