DNews:04 Feb: తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్‌పై దాఖలైన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఈ మేరకు ఫిబ్రవరి 4న స్పీకర్ తన తుది నిర్ణయాన్ని వెల్లడిస్తూ సంజయ్ కుమార్‌కు క్లీన్ చిట్ ఇచ్చారు.

బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి మారారన్న ఆరోపణలపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన స్పీకర్, ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మారారనడానికి తగిన ఆధారాలు లేవని స్పష్టం చేశారు. కేవలం ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలవడమే పార్టీ మారినట్లు కాదని, ఆయన సాంకేతికంగా ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యుడిగానే కొనసాగుతున్నారని స్పీకర్ తన తీర్పులో పేర్కొన్నారు.

ఈ నిర్ణయంతో ఇప్పటివరకు మొత్తం 8 మంది ఎమ్మెల్యేలకు అనర్హత కేసుల నుండి విముక్తి లభించినట్లయింది. గతంలోనే అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి వంటి ఏడుగురు ఎమ్మెల్యేలకు స్పీకర్ ఇదే తరహాలో ఊరటనిచ్చారు. ప్రస్తుతం కేవలం దానం నాగేందర్, కడియం శ్రీహరిలకు సంబంధించిన పిటిషన్లు మాత్రమే స్పీకర్ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిణామంపై ప్రతిపక్ష బీఆర్ఎస్ అసహనం వ్యక్తం చేస్తుండగా, జగిత్యాల నియోజకవర్గంలోని సంజయ్ వర్గీయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

By rajesh

పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana పుదీనాతో చేసే ఆరోగ్యకర వంటలు | Healthy recipes made with mint-DTv Telangana బ్రెడ్ తో టేస్ట్ అదిరే రెసిపీస్ | Tasty recipes with bread-DTv Telangana శక్తిని పెంచే హోమ్మేడ్ డ్రింక్స్ | Homemade energy-boosting drinks-DTv Telangana