
DNews:02 Dec:హైదరాబాద్ మీ వాహనాలపై ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయా? రాయితీ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకు శుభవార్త. డిసెంబర్ రెండో వారంలో దేశవ్యాప్తంగా నిర్వహించే లోక్ అదాలత్‌లో పాత ట్రాఫిక్ చలాన్లపై ఏకంగా 50 శాతం నుంచి 100 శాతం వరకు డిస్కౌంట్ ఇచ్చి క్లియర్ చేసుకునే అవకాశం లభించనుంది.
లోక్ అదాలత్ ఎప్పుడు, ఎక్కడ?
- తేదీ: దేశవ్యాప్తంగా లోక్ అదాలత్‌ను డిసెంబర్ 13న నిర్వహించనున్నారు.
- రాష్ట్రాలు: ఈ ప్రత్యేక డ్రైవ్‌లో మొత్తం 11 రాష్ట్రాలు భాగమవుతున్నాయి. అందులో తెలంగాణతో పాటు పశ్చిమ బెంగాల్, ఢిల్లీ, హర్యానా, పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు, కర్ణాటక, రాజస్థాన్ రాష్ట్రాలు ఉన్నాయి.
- నిర్వహణ: నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ (NALSA) ఈ లోక్ అదాలత్‌లను నిర్వహిస్తుంది.
ఏ చలాన్లు సెటిల్ చేసుకోవచ్చు?
లోక్ అదాలత్‌లో చిన్న ట్రాఫిక్ ఉల్లంఘనలకు సంబంధించిన పాత ఈ-చలాన్లను సెటిల్ చేసుకోవచ్చు. వీటిలో:
- హెల్మెట్ లేకుండా డ్రైవింగ్
- సీట్‌బెల్ట్ లేకుండా డ్రైవింగ్
- రెడ్ సిగ్నల్ జంప్
- సాధారణ ఓవర్ స్పీడింగ్
- రాంగ్ పార్కింగ్
- పొల్యూషన్ చలాన్లు
- లైసెన్స్ లేకుండా డ్రైవింగ్
- నంబర్ ప్లేట్ లోపాలు, ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లోపాలు
- ఇతర పొరపాట్లతో నమోదైన ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న చలాన్లు
ముఖ్య గమనిక:
- కేసు క్లోజ్: చలాన్ సెటిల్ చేసిన తర్వాత, దానికి సంబంధించిన కేసు కూడా పూర్తిగా క్లోజ్ అవుతుంది. భవిష్యత్‌లో మరోసారి కోర్టు విచారణ ఉండదు.
- రాయితీ వర్తించని కేసులు: మద్యం సేవించి వాహనం నడపడం, హిట్ అండ్ రన్ కేసులు, ప్రమాదకర డ్రైవింగ్, గాయాలు లేదా మరణాలకు దారితీసిన రోడ్డు ప్రమాదాలు వంటి ప్రాణాలకు ముప్పు కలిగించే సీరియస్ కేసులకు ఈ డిస్కౌంట్ వర్తించదు అని అధికారులు స్పష్టం చేశారు.
అభ్యర్థులు ముందుగా తమ వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లు చెక్ చేసుకుని, అవసరమైన డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుని, లోక్ అదాలత్ నిర్వహించే ప్రదేశానికి వెళ్లాల్సి ఉంటుంది.పూర్తి వివరాల కోసం https://nalsa.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించాలని అధికారులు సూచించారు.
