
DSports:31 OCT:మెల్బోర్న్: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం (అక్టోబర్ 31) మెల్బోర్న్ వేదికగా ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలి టీ20 వర్షం కారణంగా రద్దయిన నేపథ్యంలో, ఈ మ్యాచ్ రెండు జట్లకూ కీలకంగా మారింది. మిగిలిన నాలుగు టీ20ల్లో మూడు గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకోనుంది.
భారత జట్టు ఎటువంటి మార్పులు చేయకుండా తొలి మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగింది. మరోవైపు ఆస్ట్రేలియా జట్టులో ఒక మార్పు చోటు చేసుకుంది — జోష్ ఫిలిప్ స్థానంలో మాథ్యూ షార్ట్ ఆడుతున్నారు.
వాతావరణం ఆందోళన కలిగిస్తోంది:
మొదటి మ్యాచ్ మాదిరిగానే మెల్బోర్న్లో కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో భారత్ విజయం లక్ష్యంగా బరిలోకి దిగింది.
బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్య, శుభ్‌మన్ గిల్ దూకుడుగా ఆడే అవకాశం ఉంది.
బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్ జట్టు బలాన్ని మరింత పెంచనున్నారు.
జట్లు:
ఆస్ట్రేలియా (ప్లేయింగ్ XI): మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (కెప్టెన్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్
ఇండియా (ప్లేయింగ్ XI): అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా
