
గన్నవరం విమానాశ్రయంలో ఎయిరిండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. విజయవాడ నుంచి బెంగళూరుకు బయలుదేరాల్సిన విమానం టేకాఫ్ అవుతుండగా, ఇంజిన్లోకి పక్షి దూసుకెళ్లింది. ఈ విషయాన్ని గుర్తించిన పైలట్ వెంటనే అప్రమత్తమై ఎయిర్ బ్రేక్ (Emergency braking) లు అమలు చేయడం జరిగింది. దీనివల్ల విమానం సురక్షితంగా నిలిపివేయబడింది.
ఈ ఘటన గురువారం (సెప్టెంబర్ 4, 2025) ఉదయం 8:25 గంటల ప్రాంతంలో జరిగింది. విమానంలో 90 మంది ప్రయాణికులు ఉన్నారు. పైలట్ అప్రమత్తంగా వ్యవహరించడంతో వారంతా సురక్షితంగా బయటపడ్డారు. పక్షులు ఢీకొట్టడం వల్ల విమానానికి స్వల్పంగా నష్టం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రయాణికులను విమానాశ్రయ లాంజ్‌కు తరలించారు. విమానానికి మరమ్మతులు చేసిన తర్వాత సర్వీసులను తిరిగి ప్రారంభిస్తామని ఎయిర్ ఇండియా అధికారులు తెలిపారు.
