DSports:25 OCT:సిడ్నీ: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో చివరిదైన మూడో వన్డేలో టీమ్‌ఇండియా హిట్‌మ్యాన్ రోహిత్‌ శర్మ (Rohit Sharma) సెంచరీతో చెలరేగిపోయాడు. సిడ్నీ పిచ్‌పై బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన శర్మ, తన కెరీర్‌లో ఇది 33వ వన్డే సెంచరీని నమోదు చేశాడు.

237 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌ తరఫున రోహిత్ శర్మ 105 బంతుల్లో 11 ఫోర్లు, రెండు సిక్సర్ల సహాయంతో తన సెంచరీని పూర్తి చేశాడు.

తొలి వన్డేలో విఫలమైనా, రెండో వన్డేలో హాఫ్ సెంచరీ సాధించిన రోహిత్.. మూడో వన్డేలో మాత్రం సెంచరీతో అద్భుతంగా ఆకట్టుకున్నాడు. బౌండరీలతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించడంతో పాటు, సింగిల్స్‌ తీస్తూ స్ట్రయిక్‌ను రొటేట్ చేశాడు. రోహిత్, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కు అజేయంగా 100కు పైగా పరుగులను జోడించారు. కోహ్లీ కూడా ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు.

ఈ ఇద్దరు ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనతో భారత్ జట్టు సులువుగా విజయం దిశగా పయనిస్తోంది.

By rajesh

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana