పని-జీవిత సంతులనం: కెరీర్ & వ్యక్తిగత జీవితం ను బ్యాలెన్స్ చేసుకోవడం.

ప్రస్తుతం మన జీవితం చాలా వేగంగా ఉంటుంది,మనం కెరీర్ మరియు వ్యక్తిగత జీవితం సమతుల్యం చేసుకోవడం చాలా ముఖ్యం.వర్క్-లైఫ్ బ్యాలెన్స్ లేకపోతే మనం మానసిక, శారీరక, భావోద్వేగ ఆరోగ్యం మీద ప్రతికూల ప్రభావం చూపించవచ్చు.

పని-జీవిత సంతులనం:
వర్క్-లైఫ్ బ్యాలెన్స్ అంటే పని మరియు వ్యక్తిగత జీవితాన్ని సరిగ్గా సమన్వయంగా నిర్వహించడం.
అంటే కెరీర్ పై ఏకాగ్రతతో, కుటుంబం, స్నేహితులు, అభిరుచులు, విశ్రాంతి కోసం కూడా సమయం కేటాయించడం.
సుఖమయమైన జీవనం పొందడానికి కొన్ని సులభమైన అలవాట్లు ఉన్నాయి:

సరైన నిద్ర ప్రతి రోజు కనీసం 7–8 గంటల పూర్తి నిద్ర తీసుకోవాలి.నిద్ర సరియైనప్పుడు మానసిక శాంతి,శారీరక శక్తి పెరుగుతుంది.
ఆహారం సరిగా,పోషకాహారమైన ఆహారం తీసుకోవడం ముఖ్యం.విటమిన్లు,కాయగూర్లు,పండ్లు ఎక్కువగా తీసుకోవాలి.జంక్ ఫుడ్ తగ్గించడం,తగినంత నీరు తాగడం అవసరం.
ధ్యానం మరియు విశ్రాంతి 10–15 నిమిషాలు ధ్యానం చేయడం, లోతైన శ్వాస తీసుకోవడం మన మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచుతుంది.
నిత్య వ్యాయామం రోజువారీ నడక,ఇంట్లో సులభమైన వ్యాయామాలు,యోగా,స్ట్రెచింగ్ ఒత్తిడి తగ్గించడానికి సహాయపడతాయి.
కుటుంబ సమయం:

కుటుంబ సమయం పని-జీవిత సంతులనం లో అత్యంత అవసరం.
ప్రతి రోజు కుటుంబ సభ్యులతో సమయాన్ని పంచుకోవడం,వారాంతాల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేసుకోవడం సంబంధాలను బలపరిచే మార్గం.
పిల్లలు,భర్త/భార్య,తల్లిదండ్రులతో అర్థవంతమైన సంభాషణ కలిగి ఉండటం అవసరం.
కుటుంబ మద్దతు వృత్తి ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది.

వృత్తి,కుటుంబం మరియు స్వీయ సమతులిత జీవనశైలి మన మానసిక,శారీరక,భావోద్వేగ ఆరోగ్యానికి అవసరం. వృత్తి లో ఎదగడం ముఖ్యం,కానీ కుటుంబం,వ్యక్తిగత జీవితం,విశ్రాంతి,ఇష్టమైన పనులకు సమయం ఇవ్వడం కూడా అంతే ముఖ్యము.ప్రతిరోజూ చేతన ప్రయత్నం తో జీవనశైలి ప్రణాళిక చేస్తే మన జీవితం సుఖంగా, సమతులితంగా ఉంటుంది.

వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana
వెల్లుల్లి పొట్టు వేస్ట్ కాదు.. దాని వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే! This season Travel from destinations Cashe, Cookies clearing పేగులను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు | Foods that keep the intestines healthy-DTv Telangana నారింజ తొక్కలతో ఫేస్ ప్యాక్స్ | Face packs with orange peels-DTv Telangana